రూ.15 వేల జీతం ఉన్నా ఈజీగా పర్సనల్ లోన్.. ఈ 6 బ్యాంకుల్లో బంపర్ ఆఫర్

www.mannamweb.com


అత్యవసరంగా డబ్బు అవసరమైతే, పర్సనల్ లోన్ వైపు వెళుతుంటారు చాలామంది. ఇతర లోన్స్ తో పోల్చితే ఈ లోన్ సులభంగా మంజూరు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రుణాలను NBFCలు, బ్యాంకులు, ఆన్‌లైన్ రుణ దాతలు ఇస్తారు.
ఈ రుణాలపై సెక్యూరిటీ కూడా తక్కువే. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం రుణ అర్హతకు అత్యంత కీలక అంశాలుగా పరిగణిస్తాయి బ్యాంకులు.

మీకు పర్సనల్ లోన్ అవసరం అయితే, ముందు మీ ఆదాయం చూస్తాయి రుణం మంజూరు చేసే సంస్థలు. మీ ఆదాయం తక్కువగా ఉంటే.. మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ ఆమోదం పొందడంలో కొన్ని సమస్యలు ఎదురవుతుండటం చూస్తుంటాం. అయితే దేశంలోని కొన్ని ప్రధాన ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు కూడా పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దామా..

బ్యాంక్/NBFC కనీస వేతనం
ICICI బ్యాంక్ రూ. 30,000
HDFC బ్యాంక్ రూ. 25,000
కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 25,000
ఇండస్‌ఇండ్ బ్యాంక్ రూ. 25,000
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 15,000
యాక్సిస్ బ్యాంక్ రూ. 15,000

1. ICICI బ్యాంక్
వడ్డీ రేటు: 10.85 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 50 లక్షల వరకు
రుణ కాల వ్యవధి: 6 సంవత్సరాల వరకు

2. HDFC బ్యాంక్
వడ్డీ రేటు: 10.85 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 40 లక్షల వరకు
రుణ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

3. కోటక్ మహీంద్రా బ్యాంక్
వడ్డీ రేటు: 10.99 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 40 లక్షల వరకు
రుణ కాల వ్యవధి: 6 సంవత్సరాల వరకు

4. IndusInd బ్యాంక్
వడ్డీ రేటు: 10.49 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 50 లక్షల వరకు
రుణ కాల వ్యవధి: 6 సంవత్సరాల వరకు

5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేటు: 11.45 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 30 లక్షల వరకు
రుణ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

6. యాక్సిస్ బ్యాంక్
వడ్డీ రేటు: 11.25 శాతం నుండి
గరిష్ట రుణ మొత్తం: రూ. 10 లక్షల వరకు
రుణ కాల వ్యవధి: 5 సంవత్సరాల వరకు.