అత్యవసర సమయాల్లో ఆర్థిక భరోసా.. ఆ బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్‌పై బంపర్ ఆఫర్లు

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు కచ్చితంగా పర్సనల్ లోన్స్‌పై ఆధారపడుతున్నారు.

పర్సనల్ లోన్స్ మన ఆదాయాన్ని, ఖర్చులను బేరీజు వేసుకుని బ్యాంకులు మంజూరు చేస్తాయి. పర్సనల్ లోన్స్ ద్వారా గృహ పునరుద్ధరణలు, ఊహించని ఖర్చులు లేదా రుణాలను ఏకీకృతం చేయడం కోసం మంచి పరిష్కారంగా నిలుస్తాయి. అయితే వ్యక్తిగత రుణాలు అసురక్షితమని అయితే త్వరగా నిధులు అవసరమయ్యే వారికి సులభంగా అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రుణాలు సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో లేదా అత్యవసర నిధులు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ముఖ్యంగా బ్యాంకుల నిబంధనలను అనుసరించి ఈ రుణాల వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పర్సనల్ లోన్స్‌పై ఏయే బ్యాంకులు ఎంత మేరకు రుణాలు మంజూరు చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పర్సనల్ లోన్స్‌పై 10.50 శాతం నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. అంటే ఈ బ్యాంకులో రూ.5 లక్షల బ్యాంకు రుణం పొందితే ఈఎంఐ రూ.10,747గా ఉంటుంది. అంటే రూ. 1 లక్షకు ఈఎంఐ రూ. 2,149 ఉంటుంది. అయితే ఈ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుకి రూ. 4,999 వసూలు చేస్తుంది.

టాటా క్యాపిటల్

టాటా క్యాపిటల్ పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.99 శాతం ఉంది. రూ. 5 లక్షలకు ఈఎంఐ రూ. 10,869 వరకు ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు 5.5 శాతం వరకు ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.35 శాతం నుంచి 15.50 శాతం వరకు ఉంది. రూ. 5 లక్షలకు ఈఎంఐ రూ. 10,959 నుంచి రూ.12,027 వరకు ఉంటుంది. అలాగే పర్సనల్‌ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు: 1.50 శాతం వరకు ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంకులో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.80 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అంటే రూ. 5 లక్షలకు ఈఎంఐ రూ. 10,821 నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా 2 శాతం వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.15 శాతం నుంచి 18.75 శాతం వరకు ఉంటుంది. అంటే రూ. 5 లక్షలకు ఈఎంఐ రూ. 10,909 నుంచి రూ.12,902 వరకు ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.25 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ. 5 లక్షలకు ఈఎంఐ రూ. 10,934 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఈ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంటుంది.