ఎలక్ట్రిక్ కార్లకు ప్రస్తుతం క్రేజ్ పెరుగుతోంది. భారతదేశంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాదు, ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు కూడా. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు పేరు వేవ్ ఈవా (Vayve Eva). పుణెకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ చిన్న, చౌకైన ఎలక్ట్రిక్ కారు కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే ఇది భారతీయ రోడ్లపై పరుగులు తీయనుంది. ఈ కారులో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.
125 నుండి 250 కి.మీ వరకు ఫుల్ రేంజ్
వేవ్ ఈవా మూడు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉండనుంది. 9 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక ఛార్జ్‌పై 125 కి.మీ, 12.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో 175 కి.మీ, 18 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఏకంగా 250 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.
5 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్
మీరు ఈ కారును ఇంట్లో AC ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే, 10 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. అదే DC ఫాస్ట్ ఛార్జర్‌పై కేవలం 5 నిమిషాల్లో 50 కిలోమీటర్ల రేంజ్‌కు సరిపడా ఛార్జ్ అవుతుంది. ఇక 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుంది.
సూర్యరశ్మితో నడిచే కారు
వేవ్ ఈవాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకునే వీలుంది. దీని ద్వారా కారుకు అదనంగా 10 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఈ విధంగా ఏడాదికి దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ మోటార్‌తో నడుస్తుంది. కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. సిటీ రైడ్‌కు ఇది ఒక అద్భుతమైన కారుగా నిలుస్తుంది.
చిన్న కుటుంబానికి పర్ఫెక్ట్ కారు
వేవ్ ఈవా ఎలక్ట్రిక్ కారు నిజానికి చిన్న కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని సైజు చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది హ్యాచ్‌బ్యాక్ కారు కంటే కూడా తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. దీని వల్ల చిన్న, ఇరుకైన వీధుల్లో కూడా సులభంగా తిప్పవచ్చు. ఈ కారు పొడవు 2950 మి.మీ, వెడల్పు కేవలం 1200 మి.మీ. అయితే ఎత్తు 1590 మి.మీ ఉండటం వల్ల హెడ్‌రూమ్ బాగా ఉంటుంది. ఈ కారులో ముందు ఒక డ్రైవర్ సీటు, వెనుక ఇద్దరు కూర్చునే సీట్లు (మొత్తం 3 ప్రయాణికులు) ఉంటాయి. ఈ విధంగా ఒక చిన్న కుటుంబం ఈ కారులో హాయిగా ప్రయాణించవచ్చు.
చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు
సైజులో చిన్నగా ఉన్నప్పటికీ ఈ కారులో ఫీచర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో డ్యూయల్ టచ్‌స్క్రీన్, 6-వే పవర్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, పార్కింగ్ సెన్సార్‌లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ కెమెరా, కీ-లెస్ ఎంట్రీ, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో కంపెనీ క్లైమేట్ కంట్రోల్, చిల్లర్‌ను కూడా అందిస్తోంది.
వేవ్ ఈవా ధర
దీని 9kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ‘నోవా’ ధర రూ. 3.25 లక్షలు. 12.6 kWh బ్యాటరీ కలిగిన ‘స్టెల్లా’ మోడల్ ధర రూ. 3.99 లక్షలు, 18kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ‘వేగా’ మోడల్ ధర రూ. 4.49 లక్షలు.
































