Petrol Price Hike: వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. ఎక్కడో తెలుసా?

www.mannamweb.com


ద్రవ్యోల్బణం ఇప్పటికే పాకిస్థాన్ వెన్ను విరిచింది. కరెంటు రేట్ల భారీ పెంపు తర్వాత కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలపై ద్రవ్యోల్బణం ‘పెట్రోల్’ బాంబు మరోసారి పేలింది.

ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ ప్రజలపై ఖరీదైన పెట్రోల్ భారం మరింత పెరిగింది. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచేసింది. ఈ పెంపుతో పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.300కి చేరువైంది.

పాకిస్థాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.9.99 పెంచింది. దీని తర్వాత పెట్రోల్ ధర రూ.275.60కి పెరిగింది. అదే సమయంలో డీజిల్ ధర 6.18 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత డీజిల్ లీటరుకు 283.63 రూపాయలుగా మారింది. అంతకుముందు జూలై 2న ధరలు పెరిగాయి. దీనికి 14 రోజుల ముందు జూలై 1న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.7, రూ.9 పెంచారు. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తన నివేదికలలో ఒకదానిలో పెట్రోలు ధరలను లీటరుకు రూ. 7.45 పెంచినట్లు, హై-స్పీడ్ డీజిల్ ధర రూ.9.56 (హెచ్‌ఎస్‌డి) పెంచినట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నివేదించింది.

పన్నును పెంచే అవకాశం:

నివేదికల ప్రకారం.. ఫైనాన్స్ బిల్లు 2024లో పెట్రోలియం పన్ను గరిష్ట పరిమితిని లీటరుకు రూ.80గా ప్రతిపాదించారు. అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం పన్నులు పెంచనుంది. ఇది పెట్రోల్, డిజీల్‌ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది.