ఫోన్‌పేలో ఇది వెంటనే ఆఫ్ చేయండి . . లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అయిపోవడం ఖాయం !

www.mannamweb.com


నేటి కాలంలో, ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల ద్వారా లావాదేవీలు చేయడం సులభతరంగా మారింది. అయితే హ్యాకర్లు, మోసగాళ్ల కారణంగా, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ కొన్నిసార్లు వినియోగదారులకు ప్రమాదకరంగా మారుతోంది .

UPI ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని పొందడానికి చాలా మంది తరచుగా UPI యాప్‌లను ఆశ్రయిస్తారు. UPI లో ఒక మోడ్‌ని ఆన్ చేయడం వలన మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలుసా?

ఈ UPI మోడ్‌ని ఆన్ చేయవద్దు

UPIని ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు, రీఛార్జ్ చేస్తారు, OTT యాప్‌లను రీఛార్జ్ చేస్తారు, ఇతర యాప్‌లకు సబ్‌స్క్రయిబ్ చేస్తాము. అటువంటి చెల్లింపు ప్రతి నెలా చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి UPI ఆటోపే మోడ్‌ను ఉపయోగించాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు UPI ఆటోపే మోడ్ కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

UPI ఆటోపే మోడ్ అంటే ఏమిటి?

UPI ఫీచర్లలో ఒకటి ఆటోపే మోడ్, ఇది వినియోగదారులను ఆటోమేటిక్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. దీని కోసం వినియోగదారులు UPI పిన్‌ను నమోదు చేయవలసిన అవసరం లేదు. ఒకసారి UPI PINని నమోదు చేయడం ద్వారా మీరు UPI PINని నమోదు చేయకుండానే భవిష్యత్తులో సులభంగా చెల్లింపు చేయవచ్చు.

మీరు నెలవారీ చెల్లింపు చేసే OTT యాప్‌ల కోసం లేదా పేమెంట్ చేయని వాటి కోసం ఆటోపే మోడ్‌ను ఆన్‌లో ఉంచినట్లయితే కొన్నిసార్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే , బ్యాంకులో ఒకసారి ఆటో పే సౌకర్యం ఎనేబుల్ అయి ఉంటే.. ఆ కంపెనీలు మీకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు లాగేస్తూనే ఉంటాయి . ఉదాహరణకు మీరు ఒక యాప్ ఒక నెల యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది . అప్పుడు మీరు దానికి చెల్లించాల్సిన డబ్బు యూపీని ద్వారా చెల్లించారు . అయితే, నెల తరువాత మీకు ఆ యాప్ తో పనిలేదు. మీరు ఈ ఆటో పే విషయం మర్చిపోయారు . కానీ , యాప్ కి చెందిన సంస్థకు మాత్రం మీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఆటోమెటిగ్గా డబ్బు చేరిపోతుంది. ఎప్పటికప్పుడు యూపీఐ లో ఆటోమోడ్ ఆప్షన్ ఇచ్చిన యాప్స్ చెక్ చేసుకోవాలి . వాటిలో అవసరం లేదు అనుకున్న యాప్స్ కి సంబంధించిన ఆటో పే మోడ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే మీ ఎకౌంట్ లో డబ్బులు పోవడమే కాదు . . మీ బడ్జెట్ కూడా తల్లకిందులు అయిపోతుంది . బీ కేర్ ఫుల్ ! ఇక్కడ మీ సౌలభ్యం కోసం యూపీఐ లో ఆటో పే మోడ్ ఆప్షన్ ఎలా డిజేబుల్ చేయాలో ఇవ్వడం జరిగింది.

ఆటోపే మోడ్‌ని ఎలా డిసేబుల్ చేయాలి:

Google Pay లేదా PhonePe ప్రొఫైల్‌కి వెళ్లండి.
ఇక్కడ పేమెంట్ మెంజిమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి .
అక్కడ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి
అప్పుడు మీరు ఆటో పే ఆప్షన్స్ ఇచ్చిన యాప్స్ కనిపిస్తాయి
దాని పక్కనే మీకు పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది.
మీరు ఒకవేళ ఆ యాప్ ని భవిష్యత్ లో ఉపయోగించే అవకాశం ఉంటే పాజ్ క్లిక్ చేయండి . అప్పుడు ఆటో మెటిక్ గా ఆటో పే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది . తిరిగి ఆ యాప్ ఉపయోగించాలని అనుకున్నపుడు దానిని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ మీరు ఆ యాప్ భవిష్యత్ లో ఉపయోగించే అవకాశం లేదు అనుకుంటే , మీ ఆటో పే యాప్స్ లిస్ట్ కింద భాగంలో డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది . దానిని మీరు క్లిక్ చేస్తే ఆ యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది . బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ ఉండదు .