పైన్ నట్స్.. వీటిని చిల్గోజా అని కూడా అంటారు. ఇది కూడా డ్రైఫ్రట్స్‌లో ఒక వెరైటీ. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ వల్ల ఎముకలు ఐరన్ లాగా దృఢంగా తయారవుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల క్యాల్షియం లోపం నెల రోజుల్లో నయమవుతుంది. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలుంటాయి.
అనేక పోషకాలున్న పైన్ నట్స్ ధర మాత్రం చాలా ఎక్కువ. కిలోకు దాదాపుగా 8000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఓ గ్రాము బంగారంతో సమానం. పైన్ గింజలు తినడానికి చాలా రుచికరమైనవి. పోషకమైనవి. ఇది మనల్ని అనేక వ్యాధుల నుండి రక్షించే దివ్యౌషధం.
మనకు అందుబాటులో ఉన్న అనేక డ్రైఫ్రూట్స్‌లలో రుచికరమైనవి అంటే..జీడిపప్పు, బాదాం, పిస్తాలే కాదు.. అంతకుమించిన మధురమైన రుచి ఈ పైన్ నట్స్‌కు ఉంటుంది. తినడానికి క్రీమీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఏదో మంచి స్వీట్ తిన్న అనుభూతి వస్తుంది.
పైన్‌నట్స్‌లో అధిక శాతం అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి అనేక ఇతర పోషకాలు పైన్ గింజలలో ఉన్నాయి. పైన్ గింజలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచుతుంది.
వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చిల్గోజా తినడం అలవాటు చేసుకోవాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది. అంతేకాదు..చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.
పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్ లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఉన్నవారు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.