Pioneer Poll Strategies: ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గెలిచే పార్టీ ఇదే.. సంచలన సర్వే!

Pioneer Poll Strategies: ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు గెలిచే పార్టీ ఇదే.. సంచలన సర్వే!


Pioneer Poll Strategies: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరి కొద్ది రోజుల్లో షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్ చల్ చేస్తున్నాయి.
రోజుకో సర్వే బయటకు వస్తోంది. ప్రజల సైతం సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వివిధ కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న కొన్ని సంస్థలు ప్రసార మాధ్యమాల ద్వారా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పనిచేసే పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేపట్టినట్లు సంస్థ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల నమూనాల సేకరణ ద్వారా సర్వే చేసినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. జనవరి 1 నుంచి 15 మధ్యఈ నమూనాలు సేకరించినట్లు ఆయన వివరించారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన కూటమికి 95 నుంచి 100 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చింది. వైసిపి 35 నుంచి 40 స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. మరో 45 నుంచి 50 చోట్ల ఇరుపక్షాల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని స్పష్టం చేసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువతతో పాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి రాండం పద్ధతిలో సర్వే నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు చెబుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలసలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. పలాస, నరసన్నపేటలో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది.విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఎచ్చెర్ల,రాజాం, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్లలో టిడిపి, జనసేన కూటమి, చీపురుపల్లి, గజపతినగరంలో వైసిపి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరులో వైసిపి, పాలకొండ, రంపచోడవరం లో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఎస్. కోట, భీమిలి, విశాఖ తూర్పు విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, గాజువాక నియోజకవర్గం టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో చోడవరం, అనకాపల్లి, పెందుర్తి,ఎలమంచిలి, నర్సీపట్నంలో టిడిపి, జనసేన కూటమికి విజయావకాశాలు ఉన్నాయి. మాడుగులలో వైసిపి గెలిచే అవకాశం ఉంది. పాయకరావుపేటలో హోరాహోరీ ఫైట్ నడవనుంది.

కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలో పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేటలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. తునిలో రెండు పార్టీల మధ్య గట్టి ఫైట్ నడవనుంది. రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనపర్తి లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. రాజానగరంలో ఇరుపక్షాల మధ్య ఫైట్ నెలకొంది. అమలాపురం లోక్ సభ స్థానం పరిధిలో ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేటలో కూటమి గెలిచే అవకాశం ఉంది. రామచంద్రపురం లో మాత్రం హోరాహోరి పోరు నడవనుంది. నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో అచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకులలో కూటమి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది. ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంగటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడులో కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. ఏలూరు,కైకలూరులో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది.

మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరులో కూటమికి స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. పామర్రు, గుడివాడ, గన్నవరంలో గెట్ ఫైట్ ఉంటుంది. నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాలలో కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటలో మాత్రం హోరాహోరీ ఫైట్ నడవనుంది. బాపట్ల పార్లమెంట్ స్థానం పరిధిలో వేమూరు, రేపల్లె, పరుచూరు, అద్దంకిలో కూటమి అభ్యర్థులు, బాపట్ల,చీరాలలో వైసీపీ అభ్యర్థులువిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సంతనూతలపాడు లో ఇరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది. ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోఎర్రగొండపాలెం, కొండేపిలో కూటమి అభ్యర్థులు, దర్శి, మార్కాపురంలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరిలో మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుంది. నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కూటమి అభ్యర్థులు, కందుకూరు, ఆత్మకూరులో వైసిపి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి,కోవూరు, కావలిలో గట్టి ఫైట్ ఉంటుంది. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. తిరువూరు, మైలవరంలో మాత్రం విరుపక్షాల మధ్య ఫైట్ నడవనుంది.గుంటూరు ఎంపీ స్థానం పరిధిలో మంగళగిరి,పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు తూర్పు లో ఓటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. తాడికొండ, గుంటూరు పశ్చిమ లో గట్టి ఫైట్ ఉంటుంది.

చిత్తూరు పార్లమెంట్ స్థానం పరిధిలో నగిరి, పలమనేరు, కుప్పంలో కూటమి అభ్యర్థులు, చిత్తూరు, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో తంబళ్లపల్లెలో కూటమి అభ్యర్థి, రాయచోటి, పుంగనూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లిలో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. కడప పార్లమెంట్ స్థానం పరిధిలో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు,ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. బద్వేలు, మైదకూరులో మాత్రం పోరా హోలీ ఫైట్ ఉంటుంది. నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో పాణ్యం, నంద్యాలలో కూటమి అభ్యర్థులు, నందికొట్కూరు లో వైసీపీ గెలుపొందే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ,శ్రీశైలం, బనగానపల్లె,డోన్ లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో కర్నూలు, మంత్రాలయం, ఆదోనిలో కూటమి అభ్యర్థులు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. ఆలూరు లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ,గుంతకల్లు, తాడిపత్రి,అనంతపురం, కళ్యాణదుర్గంలో ఓటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి. సింగనమల నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది. హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, ధర్మవరంలో కూటమి అభ్యర్థులు, మడకశిర,పుట్టపర్తి లో మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉంది. కదిరిలో హోరాహోరీ ఫైట్ ఉంటుంది.మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమిదేవి విజయమని ఈ సర్వే సంస్థ తేల్చడం విశేషం.