శాస్త్రీయ కారణాలు
వంటల్లో రుచి కోసం వాడే బిర్యానీ ఆకు నిద్రకు కూడా హెల్ప్ చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. దీంట్లో లినలూల్ (Linalool), 1,8-సినీయోల్ (1,8-Cineole) లాంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడులోని లింబిక్ సిస్టమ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఈ సిస్టమ్ ఎమోషన్స్, మెమొరీ, ముప్పును ప్రాసెస్ చేస్తుంది. ఈ అరోమా బ్రెయిన్‌ను రిలాక్స్ మోడ్‌కి మారుస్తుంది. దీనినే పారాసింపథెటిక్ యాక్టివేషన్ అంటారు. అంటే, శరీరం రెస్ట్ తీసుకోవడానికి, జీర్ణక్రియకు సిద్ధమయ్యే ప్రక్రియ. ఈ రిలాక్సింగ్ ప్రాసెస్ వల్ల నిద్ర లేని టెన్షన్ తగ్గుతుంది.
హ్యాక్ ఎలా పనిచేస్తుంది?
బిర్యానీ ఆకు (Bay Leaf) దిండు కింద పెట్టుకోవడం వల్ల కేవలం సువాసన మాత్రమే కాకుండా నిద్రకు సంబంధించిన సెన్సరీని రీసెట్ చేస్తుంది. ఇది మూడు విధాలుగా పనిచేస్తుందని స్లీప్ కోచ్‌లు చెబుతున్నారు. ఈ ఆకు నుంచి వచ్చే వాసన బ్రెయిన్‌కు ‘ఇది రెస్ట్ తీసుకునే సమయం’ అనే సిగ్నల్ ఇస్తుంది. అలాగే, ఆకుని తీసుకోవడం, దాన్ని మడవడం, దిండు కవర్‌లో పెట్టడం లాంటి చిన్న ఫిజికల్ యాక్షన్ స్లీప్ రొటీన్‌కు యాడ్ అవుతుంది. నిద్ర వస్తుందని కేవలం ఆశించకుండా దానికి మనం ఏదో ఒకటి చేస్తున్నామనే ఫీలింగ్ ఒక సంతృప్తినిస్తుంది. కొన్ని రోజులు దీన్ని కంటిన్యూ చేస్తే బ్రెయిన్ ఆ సువాసనను, ఆ యాక్షన్‌ను నిద్రకు మారడానికి కండిషనల్ లింక్ చేస్తుంది. దీనివల్ల పడుకునే ముందు ఉండే టెన్షన్ తగ్గి, త్వరగా నిద్రలోకి జారుకుంటాం. చాలామంది యూజర్స్ తక్కువ సమయంలోనే నిద్ర పట్టిందని, ఉదయం లేవగానే ఫ్రెష్‌గా అనిపించిందని రివ్యూ ఇచ్చారు.
రొటీన్ ఫాలో అవ్వండి
ఈ బిర్యానీ ఆకు (Bay Leaf) స్లీప్ హ్యాక్‌ను సింపుల్‌గా ఈ స్టెప్స్‌తో ఫాలో అవ్వొచ్చు. పగుళ్లు, మచ్చలు లేని, పూర్తిగా ఎండిన ఒకే ఒక్క ఆకును తీసుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలి మధ్య ఆకుని పట్టుకుని మెల్లగా వంచండి. చిన్నగా ‘క్రాక్’ సౌండ్ రాగానే ఆకులోని సువాసన మరింతగా రిలీజ్ అవుతుంది. ఆకు మీ మొహానికి గానీ, కళ్లకు గానీ తగలకుండా ఉండేందుకు దిండు కవర్ లోపలి అంచు వైపు పెట్టండి. వెలుతురు తగ్గించుకోవాలి. ఫోన్, స్క్రీన్స్ బెడ్ నుంచి దూరంగా ఉంచండి. పడుకున్నాక, ఆ సువాసనను గమనిస్తూ మెల్లగా కొన్ని శ్వాసలు తీసుకోండి. ప్రశాంతమైన, క్వాలిటీ స్లీప్ కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక నాచురల్ స్లీప్ ఇండ్యూసర్‌లా పనిచేస్తుంది.


































