వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి సమస్యలను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రం అనేక సూచనలు అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
ఆర్థిక సమస్యలు వాటిలో ఒకటి. అందువల్ల ఇంటిలో డబ్బు ప్రవాహాన్ని గణనీయంగా పెంచే కొన్ని వాస్తు శాస్త్ర చిట్కాలను ఈ రోజు తెలుసుకుందాం..
సంపద రాకకు వాస్తు నివారణలు
కొన్ని వాస్తు పరిహారాలు ఇంటికి సంపదని తీసుకుని రావడంతో పాటు ఆనందం, శ్రేయస్సు ని కూడా కలిగిస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరి ఇంటిలో శాశ్వత ఆస్తులు పోగు అవ్వడం ప్రారంభమవుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాతావరణం పూర్తిగా సానుకూలంగా మారుతుంది. ఇంట్లోకి శ్రేయస్సు ప్రవహించడం ప్రారంభమవుతుంది. నిజానికి ఈ వాస్తు నివారణలు నాలుగు దిశలకు సంబంధించినవి. ఈ వస్తువులను నాలుగు దిశలలో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. కనుక ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
ఏ చర్యలు తీసుకోవాలంటే
- ఇంటిలో ధన ప్రవాహాన్ని పెంచాలనుకుంటే.. అంటే మీ ఇంటిలో సంపద ప్రవహించాలని కోరుకుంటే.. ఇంటికి దక్షిణ దిశలో పసుపు రంగు గోవుల బంతిని (పసుపు రంగులో ఉన్న బంతి పువ్వులను) ఉంచండి. ఇలా చేయడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగడం చూస్తారు.
- ఇంటికి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచాలి. ఇది సాధ్యం కాకపోతే కుబేరుడి చిత్రపటాన్ని ఉత్తర దిశలో ఉంచాలి.
- ఇంటికి తూర్పు దిశలో ఒక చిన్న క్రిస్టల్ చేపను ఉంచాలి. మీరు వెండి చేపను కూడా ఉంచవచ్చు. ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇది ఇంటికి సంపదను తెస్తుంది.
- ఇంటి పశ్చిమ భాగాన్ని హనుమంతుడి నివాసంగా భావిస్తారు. హనుమంతుడికి చెందిన చిన్న గదను ఈ దిశలో ఉంచాలి. ఇది ఇంట్లోని అన్ని కష్టాలను దూరం చేస్తుంది. హనుమంతుడి ఆశీస్సులను కూడా తెస్తుంది.
- ఈ వాస్తు నివారణలను పాటిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను, అవకాశాలను కనుగొంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

































