సాధారణంగా మనం చూసే భవనాలు ఎక్కువగా RCC (Reinforced Cement Concrete) లేదా MIVAN Aluminumతో నిర్మించబడతాయి. ఇందులో పైకప్పు, గోడలు అన్నీ ఇసుక, సిమెంట్‌తో తయారు చేయబడతాయి.
ఇలాంటి ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు మరియు ప్లాస్టరింగ్‌కు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా Mineral Gypsum ఒక మంచి ఎంపికగా మారింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే ఇటుకల మీద నేరుగా పూయవచ్చు. దీనికి Curing అవసరం లేదు. అదే సమయంలో, Mineral Gypsum ఉపయోగించిన ఇళ్లలో ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.
భారతదేశంలో నదులు ఎక్కువగా ఉండటం వల్ల ఇసుక సులభంగా లభిస్తుంది. బ్రిటీష్ పాలకులు దీన్ని ఉపయోగించుకుని సిమెంట్ ఇండస్ట్రీలు స్థాపించారు. కాలక్రమేణా ఇసుక కొరత ఏర్పడటంతో Robo Sand మార్కెట్‌లోకి వచ్చింది. కానీ దీని Durability తక్కువగా ఉండటంతో, Gypsum ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. Gypsum ఒక రకమైన ఖనిజం, ఇది Calcium Sulfate Dihydrate (CaSO4·2H2O). ఇది ప్రధానంగా రాజస్థాన్‌లోని Bikaner మరియు Kashmir Valleyలో లభిస్తుంది.
మార్కెట్‌లో Composite Gypsum మరియు Mineral Gypsum అనే రెండు రకాలు ఉన్నాయి. Composite Gypsum సిమెంట్ ఇండస్ట్రీ వ్యర్థాల నుండి తయారవుతుంది, దీన్ని ఇటుకలు మరియు Chalk Pieceల తయారీలో ఉపయోగిస్తారు. Mineral Gypsum నేరుగా ఖనిజాల నుండి తీస్తారు.
ఖనిజ జిప్సం ఉపయోగాలు:
- ఇంటర్నల్ వాల్స్ & సీలింగ్‌లకు మాత్రమే (బాహ్య గోడలకు కాదు).
- Thermal Proof కారణంగా ఇంటి లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
- Fire Resistant – 3 గంటల వరకు అగ్నిని తట్టుకోగలదు.
- Cost-Effective – RCC కంటే చౌకగా ఉంటుంది.
- No Curing Required – నీటి వినియోగం తగ్గుతుంది.
ఖర్చు పోలిక:
- RCC Plastering: ₹50-55/sq.ft
- Gypsum Plastering: ₹35-40/sq.ft
- RCC Curing: 7 రోజులు, 7 లీటర్ల నీరు/sq.ft
- Gypsum: Zero Curing