PMKVY: ప్రధానమంత్రి స్కీమ్.. నెలకు రూ. 8000 పొందండి ఇలా..

PMKVY: కేంద్ర ప్రభుత్వం యువత కోసం రకరకాల పథకాలు తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగాల కల్పనకు ఎంతో ప్రయత్నం చేస్తోంది. స్కిల్ డెవలప్ చేస్తూనే..


చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు ఇస్తుంది. అలాంటి వాటిలో ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన పథకం గురించి తెలుసుకుందాం. దీని ద్వారా 10వ తరగతి పాసైనా చాలు, ఇంట్లోనే ఉంటూ రూ.8,000 నెలకు పొందవచ్చు.

ఈ పథకం పేరు ఏంటో కాదు ప్రధాన మంత్రి కౌశల్ వికాస పథకం. దీన్ని పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అని పిలుస్తారు. భారతీయ యువతకు ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. ఇది నిరుద్యోగ యువతను త్వరగా ఉద్యోగాలు పొందేలా చేస్తోంది. మీరు భారత పౌరుడు లేదా పౌరురాలు అయితేనే ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత కోసమే ఈ పథకం. ఇక దీని ద్వారా లక్షల మంది యువత, ఇంట్లోనే ఉంటూ, ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకోవచ్చు. అయితే దీని కోసం స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేస్తూ నెలకు రూ.8 వేలు చొప్పున పొందవచ్చు.

కోర్సు పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఇందులో రకరకాల కోర్సులు చెయ్యవచ్చు. ఈ సర్టిఫికెట్ భారతదేశంలో అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుందట. తద్వారా యువతకు ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఇక ఈ పథకం కింద లబ్ధిదారుడికి టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడీ కార్డు, బ్యాగ్ మొదలైన వాటిని ఇస్తారు. ఇంట్లో నుంచే ఆన్‌పైన్ ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి యువత. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ https://www.pmkvyofficial.org/home-page ని సంప్రదించాలి.

దరఖాస్తుదారుడు భారత పౌరుడై.. నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. కనీస విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం కొంతైనా అవగాహన ఉండాలి. ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు, విద్యార్హత పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ లు ఉండాలి.

దీన్ని ఎలా అప్లే చేసుకోవాలి అంటే.. ముందుగా పైన తెలిపిన వెబ్ సైట్ కు వెళ్లి హోమ్ పేజీలో PMKVY ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అక్కడ తెలిపిన సమాచారాన్ని అందించాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సమాచారం అందించిన తర్వాత చివరగా సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సింపుల్ గా మీరు ఇంట్లోనే ప్రధానమంత్రి నైపుణ్య అభివృద్ధి పథకం కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.