సింగయ్య మృతి కేసులో పోలీసుల దూకుడు – జగన్ కారు సీజ్

: వైఎస్ జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో నల్లపాడు పోలీసులు జగన్ కు నోటీసులు జారీ చేశారు.


తాడేపల్లి జగన్ కార్యాలయంలో నోటీసుల్ని వైసీపీ నేత అప్పిరెడ్డి తీసుకున్నారు. అలాగే జగన్ కారును సీజ్ చేశారు.

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వర్ రావు అనే పార్టీ కార్యకర్తకు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి ర్యాలీగా వెళ్లారు. అయితే ఆయన పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డు వద్ద ఓ వృద్దుడుచనిపోయాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కాన్వాయ్ వాహనం కాదని.. వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడని దృసశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెప్పిన దానికి..బయటపడిన దృశ్యాలకు చాలా తేడా ఉండటంతో విమర్శలు వచ్చాయి. దాంతో పోలీసులు కేసును మార్చారు. ఏ వన్ గా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని.. ఏ 2గా కారులో ఉన్న జగన్ ను చేర్చారు. పర్యటనలో పాల్గొన్న ఇతర నేతలపైనా కేసులు పెట్టారు. A3-A6 నాగేశ్వర్ రెడ్డి (జగన్ వ్యక్తిగత కార్యదర్శి), వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ ఉన్నారు. ఈ వ్యక్తులు జగన్ కారులో లేనప్పటికీ, అనుమతులకు మించి కాన్వాయ్లో వాహనాలు, జన సమీకరణ వల్ల ఘటన జరిగిందని పోలీసులుఆ తర్వాత రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏఆర్ కానిస్టేబుల్ గా చెబుతున్నారు. జగన్ పోలీసులు పెట్టిన ఆంక్షళు పట్టించుకోకుండా ర్యాలీ చేయడం, కారు కింద మనిషి పడినా కనీస వైద్యం అందించకుండా రోడ్డు పక్కన పడేసి పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

పోలీసులు కేసు నమోదు చేసుకుని జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు.. ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించలేదు అనే దానిపై విచారణ జరిపారు. జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. అందరూ జనాల్లో ఏం జరిగిందో తెలియలేదని చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు చెప్పలేదు.

గుంటూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా, తాడేపల్లి నుంచి 50 వాహనాలతో కాన్వాయ్ బయలుదేరింది. ఈ అనధికార ర్యాలీ, జన సమీకరణ వల్ల గందరగోళం నెలకొని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ , డ్రోన్ దృశ్యాలు, స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించిన పోలీసులు, ఈ ఘటన నిర్లక్ష్యం కంటే తీవ్రమైన నేరమని నిర్ధారించారు. దీంతో కేసును బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 105 , సెక్షన్ 49 కింద మార్చారు. ఈ సెక్షన్ రుజువైతే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.