భవిష్యత్తులో ఆర్థికంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ముందుగానే జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది.
మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఆర్థికంగా బలంగా ఉండొచ్చు. అయితే పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వానికి చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్న్స్ తో పాటు ఏ రిస్క్ ఉండదు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెడితే చేతికి 14 లక్షలు అందుకోవచ్చు. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?
పోస్టాఫీస్ చాలా రకాల పథకాలను అమలు చేస్తున్నది. చిన్న మొత్తంలో పొదుపు చేసి అధిక రాబడిని పొందొచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీరేటు అధికంగా అందిస్తారు. అయితే అధిక వడ్డీ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఈ పథకంలో 6.7 వడ్డీ అందిస్తోంది. ఈ పథకంలో ఐదు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. మీరు పెట్టే పెట్టుబడిపైనే రాబడి ఆధారపడి ఉంటుంది. వడ్డీపై అధిక వడ్డీ పొందాలంటే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.
రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు రూ. 14 లక్షలు పొందాలంటే.. రోజుకు 666 పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు రూ. 20,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల్లో రూ. 12 లక్షలు జమ అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు 6.7 ప్రకారం ఐదు సంవత్సరాలలో రూ. 2,27,315 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం రూ. 14,27,315 చేతికి అందుతుంది. ఈ పథకంలో మీ పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. దీనికోసం పోస్టాఫీస్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు మీ పెట్టుబడి, వడ్డీ కలుపుకుని మొత్తం 34,17,088 వస్తుంది.