పోస్టాఫీస్ గేమ్ చేంజర్ స్కీమ్.. రోజుకు 400 పొదుపు చేస్తే చాలు.. 70 లక్షలు పొందొచ్చు

www.mannamweb.com


ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందుకోవాలని చూస్తుంటారు. అదే సమయంలో భద్రతతో కూడిన రాబడిని కోరుకుంటారు. సురక్షితంగా అధిక లాభాలను పొందే స్కీమ్స్ కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్స్ ను అందిస్తోంది. వాటిల్లో గేమ్ చేంజర్ లాంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అది సుకన్య సమృద్ధి యోజన పథకం మాత్రమే. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభాలు అందుకోవడం గ్యారంటీ. ఈ పథకం ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు వరమని చెప్పొచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఆడపిల్లలు పుడితే భారం అనుకోకుండా.. లక్ష్మీదేవి పుట్టిందనుకునేలా చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బు ఆడబిడ్డ చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో రోజుకు 400 పెట్టుబడిపెడితే చాలు మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 70 లక్షలు అందుకోవచ్చు.

ఈ స్కీంలో చేరాలంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం ఉంటుంది. అమ్మాయికి 21ఏళ్లు నిండాక ఆ మొత్తం సొమ్మును పొందొచ్చు. అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 8.2 శాతం వడ్డీ పొందొచ్చు. ఖాతా తెరిచేందుకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితోపాటు తల్లి గాని తండ్రి గాని పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా జమ చేయాలి. అలాగే ఈ పథకంలో మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా రూ. 70 లక్షలు పొందాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పథకంలో రోజుకు 416 పొదుపు చేయాలి. అంటే నెలకు 12 వేల 500 అన్నమాట. ఇలా సంవత్సరానికి మీరు పెట్టే పెట్టుబడి మొత్తం 1 లక్షా 50 వేలు అవుతుంది. మీరు ఈ పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం 22 లక్షల 50 వేలు అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై 46 లక్షల 77 వేల, 578 ఆదాయం వస్తుంది. మీ కూతురుకు 21 ఏళ్లు నిండాక మీ చేతికి 69 లక్షల 27 వేల 578 అందుతుంది. అంటే మీకు దాదాపుగా 70 లక్షలు వస్తాయి. ఉదాహరణకు మీ కూతురు వయసు 2024 నాటికి 8 ఏళ్లు అనుకుంటే 21 ఏళ్లు నిండాక అంటే 2045 నాటికి స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. మరి మీరు మీ కూతురుకు గోల్డెన్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే వెంటనే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.