Post Office: 5 ఏళ్లలో పొందే వడ్డీ కేవలం 2 ఏళ్లలోనే.. మహిళలకోసం ప్రత్యేకంగా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ వినియోగదారులను మంచి పథకాలతో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక సాధారణంగా చాలా మంది పెట్టుబడి అనగానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇందులో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే పోస్టాఫీస్‌ మహిళలకోసం ప్రత్యేకంగా అందిస్తోన్న ఓ పథకం ద్వారా మాత్రం తక్కువ సమయంలో మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఏంటా పథకం.? దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ మహిళల కోసం మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికేట్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో మహిళలు కేవలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడితే సరిపోతుంది. దీనికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఈ వడ్డీ లభిస్తుంది. కానీ మహిళా సమ్మాన్‌ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో కేవలం రెండేళ్లలోనే ఈ వడ్డీని పొందొచ్చు. ఎక్కువకాలం డబ్బు డిపాజిట్ చేయకుండానే మంచి వడ్డీ పొందొచ్చన్నమాట.

ఈ ఖాతాను 18 ఏళ్లు దాటిని మహిళలు తెరవచచ్చు. ఒకవేళ 18 ఏళ్లలోపు బాలికలు అయితే వారి పేరెంట్స్‌ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో, మహిళలు 7.5 శాతం చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. మూడు నెలలు ఒకసారి వడ్డీని లెక్కిస్తారు. ఉదాహరణకు మహిళలు ఈ పథకలో రూ. 50000 పెట్టుబడిగా పెట్టారనుకుందాం. మీరు రెండేళ్లకు రూ. 8011 వడ్డీ లభిస్తుంది. ఇలా రెండేళ్ల తర్వాత రూ. 58011ని పొందొచ్చు. అదే రూ. లక్ష పెట్టుబడిగా పెడితే 7.5 శాతం వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ. 1,16,022 రిటర్న్స్‌ పొందొచ్చు.

Related News

ఈ పథకానికి కేవలం రెండేళ్ల మెచ్యూరిటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డబ్బును తీసుకుంటేనే మొత్తం వడ్డీ లభిస్తుంది. అయితే ఏదైనా అవసరం దృష్ట్యా మీరు ముందుగానే డబ్బులు తీసుకోవాలనుకుంటే ఏడాది తర్వాత 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదారహణకు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత రూ. 80 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *