బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాల్టీ షోకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ప్రోమోతో పాటు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుకునే సామాన్యుల కోసం ఆహ్వానాలు కోరుతూ ప్రకటన కూడా వచ్చింది.
సీజన్ 9కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ప్రతీ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనే సెలబ్రిటీలతో పాటు ప్రతీవారం కొంతమంది స్టార్లు, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుంటారు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ‘జై లవకుశ’ ప్రమోషన్స్ కూడా చేశాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలేకి మహేష్ బాబు, బిగ్ బాస్ సీజన్ 8కి రామ్ చరణ్ గెస్టులుగా వచ్చారు. చిరంజీవి, వెంకటేశ్ వంటీ సీనియర్ స్టార్లు కూడా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్‌లో కనిపించలేదు..
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలేకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే పవన్ మాత్రం ఈ షోకి రావడానికి ఆసక్తి చూపించలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘They Call him OG’ మూవీ విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 25న విడుదల అవుతున్న ‘OG’ మూవీకి సుజిత్ డైరెక్టర్..
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ‘OG’ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటానని నిర్మాత డీవీవీ దానయ్యకి మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. దీంతో బిగ్ బాస్ సీజన్ 9లో పవన్ కళ్యాణ్ మెరిసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. అదే జరిగితే టీఆర్పీ రేటింగ్స్ బద్ధలు చేసేందుకు ఫ్యాన్స్ సిద్దమైపోతున్నారు..
ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానేలేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాలేదు. అయినా ఆ తర్వాత రాబోయే ‘OG’ గురించి, బిగ్ బాస్ హౌస్‌లోకి పవన్ కళ్యాణ్ వెళ్లడం గురించి వార్తలు వస్తున్నాయి.
అయితే OG టీమ్, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినా పవన్ కళ్యాణ్, ఈ షోకి వెళ్లడం అనుమానమేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో హీరోయిన్ ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, డైరెక్టర్ సుజిత్ వంటి మూవీ టీమ్, ప్రమోషన్స్‌లో బిజీగా గడపనుంది.
































