మోటరోలా (Motorola)లో సూపర్ సక్సెస్ అయినా ఎడ్జ్ 60 సిరీస్ లో కొత్తగా ఎడ్జ్ 60 నియో (Motorola Edge 60 Neo)ని త్వరలో పరిచయం చేస్తుంది.
మొబైల్ చూడడానికి చిన్న సైజులో ఉన్న కానీ, ఫీచర్లతో నిండిన ఈ స్మార్ట్‌ఫోన్.. కిలింగ్ లుక్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరును అందించేలా ఉండబోతుంది. ఈ ఫోన్‌లో వీగన్ లెదర్ ఫినిష్ తో ఉన్న స్లిమ్ బాడీ ఉండనుంది. చేతిలో పట్టుకోవడానికి తేలికగా ఉండేలా డిజైన్ చేయబడింది. అలాగే IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ ఉండడం వలన మరింత డ్యూరబిలిటీ లభిస్తుంది.
ఈ మోటరోలా ఎడ్జ్ 60 నియోలో 6.55 అంగుళాల P-OLED స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో లభించనుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, గేమింగ్‌ను మరింత స్మూత్‌గా చేస్తుంది. అంతేకాకుండా, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉండడం వలన రోజువారీ వినియోగంలో సేఫ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7030 చిప్‌సెట్ తో రానుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఉండనున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో microSD స్లాట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే అరుదైన ఫీచర్.
ఇక ఫోటోగ్రఫీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 13MP అల్ట్రా వైడ్ కెమెరా అందించనున్నారు. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా లభించనుంది. నైట్ మోడ్, AI ఫీచర్లు ఉన్నందున ఫొటోలు స్పష్టంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీతో సాధారణ వినియోగదారులకు రెండు రోజుల వరకు కూడా పవర్ అందించగలదు. 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 15 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఈ ఫోన్ Android 15 ఆధారంగా Hello UIతో రానుంది. మోటరోలా నుంచి మూడు సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్ వస్తాయని అంచనా. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.3, అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించనున్నారు. అంతేకాకుండా, మోటో AI ఫీచర్లు ఫోటో ఎడిటింగ్, కాల్ సమ్మరైజేషన్ వంటి స్మార్ట్ సపోర్ట్ ఇస్తాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను 2025 చివరి త్రైమాసికంలో, ముఖ్యంగా పండుగ సీజన్‌లో (అక్టోబర్-నవంబర్) లాంచ్ చేసే అవకాశం ఉంది. 8GB+256GB వేరియంట్ ధర సుమారు రూ.27,990గా ఉండొచ్చని అంచనా. ఇది ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభించే అవకాశం ఉంది.
































