కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్

www.mannamweb.com


డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్‌ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌? అని ప్రభాస్‌ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు.