2025 లో కూడా ప్రభాస్ హవానే కొనసాగుతుందా

www.mannamweb.com


టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యారు ప్రభాస్.ఆ తర్వాత చాల సూపర్ హిట్ సినిమాలలో నటించారు.దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తాను చాటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ప్రతి సినిమా కోసం ఫ్యాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రభాస్ హవానే కొనసాగుతుంది. ఒక్కో సినిమాను మూడు నాలుగు సంవత్సరాల పాటు చెక్కుతుంటే హీరో ప్రభాస్ మాత్రం నాలుగైదు ప్రాజెక్టులను ఒకేసారి కవర్ చేస్తున్నారు. ఈ కారణంగా 2025 లో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్స్ లిస్టులో డార్లింగ్ పేరు టాప్ లో ఉందని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, పౌజి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల లో ది రాజా సాబ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో ఉంది. ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పౌజి సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అయిందని సమాచారం. ప్రభాస్ 2025 ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ సినిమా మీదనే దృష్టి పెట్టమన్నారు. ఇక 2025 సెకండ్ హాఫ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమ్మర్ తర్వాత పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్ నటించిన సలాడ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సలార్ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుందన్న విషయం తెలిసిందే. సలార్ సినిమా సీక్వెల్ కూడా సమ్మర్ తర్వాత మొదలు కానుందని తెలుస్తుంది. 2024లో ప్రభాస్ నటించిన కల్కి 2898 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం అందుకుంది. ఈ సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కల్కి 2 కూడా ఒకటి. ఈ సినిమా పనులు కూడా ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయని సమాచారం. ఇక చాలా రోజుల నుంచి సామాజిక మాధ్యమాలలో ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని కొన్ని వార్తలు వినిపించాయి. రిశబ్ కథతో హోంబలే బ్యానర్లో ప్రభాస్ సినిమా చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఏడాదే ఈ సినిమాకు సంబంధించి క్లారిటీ కూడా రానుంది. ఈ సినిమా అప్డేట్స్ తో 2025 లో కూడా మోస్ట్ హపెనింగ్ హీరో ప్రభాస్ అని తెలుస్తుంది.