మారుతి- ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద డీలా పడిన సంగతి తెలిసిందే. దీంతో మారుతి టీం సహా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా నిరాశ చెందారు.
ఎన్నో అంచనాలు పెట్టుకుంటే అన్నీ తలక్రిందులు కావడం జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మారుతి డిసప్పాయింట్ కాకుండా ప్రభాస్ ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చారనే న్యూస్ తెరపైకి వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మారుతి టీమ్ రియాక్ట్ అవుతూ అవన్నీ రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేసింది.
ఈ సంక్రాంతికి ‘ది రాజా సాబ్’ సినిమాతో ఫ్యాన్స్‌ను నిరాశ పర్చిన ప్రభాస్.. ఇప్పుడు క్రేజీ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ‘స్పిరిట్’ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా గురించి ఎన్నో రకాల విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ పొడవైన జుట్టు, గడ్డం, మీసాలతో కనిపించాడు. షర్ట్ లేకుండా, వీపు వైపు తిరిగి ఉన్న డార్లింగ్ శరీరంపై గాయాలు, అక్కడక్కడా కట్లు ఉన్నాయి. చేతిలో ఆల్కహాల్ గ్లాస్, నోటిలో సిగరెట్‌తో ఉన్న ప్రభాస్‌కు, చీర కట్టుకున్న త్రిప్తి దిమ్రి ఎంతో ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టేసింది.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు టాక్. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను చాలా పవర్‌ఫుల్‌గా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న ‘యాంగ్రీ యంగ్ మెన్’గా చూపిస్తారు. అర్జున్ రెడ్డి, యానిమల్ హీరో రోల్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అయితే స్పిరిట్‌లో కూడా ప్రభాస్ పాత్ర చాలా ఇంటెన్సివ్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, జపనీస్, చైనీస్, కొరియన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మరో భారీ సినిమా చేస్తున్నారు ప్రభాస్.
Post Views: 2
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.