టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లిపై మరోసారి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన పూజలే. ఆ వివరాలు చూద్దామా..
రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. ఊహించిన రేంజ్ దాటి దూసుకుపోతున్నారు. సినిమాల పరంగా టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన, 45 ఏళ్ళొచ్చినా స్టైల్ బ్యాచిలర్ గానే ఉన్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఈ పరిస్థితుల నడుమ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరోసారి చర్చనీయాంశం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసం జాతర జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన శ్యామల దేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు. ఆలయ విశిష్టిత, అమ్మవారి మహిమ వివరించారు. అయితే శ్యామల ఇంత సడెన్ గా టెంపుల్ సందర్శించడం వెనుక ఏదో ఉందని, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టే ఆమె ముందస్తుగా పూజలు చేస్తోందని చెప్పుకుంటున్నారు జనం.
ఏదేమైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు ప్రభాస్. అందం, ఆస్తి, స్టార్ స్టేటస్ ఇలా అన్నీ ఉన్నా కూడా ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో అందరి కళ్ళు ఇతగాడిపైనే ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే ప్రశ్నలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ పెద్దమ్మ చేసిన పూజలు పలు చర్చలకు తావిచ్చాయి.
త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని ఇప్పటికే చాలా సార్లు చెప్పింది శ్యామలా దేవి. మీరే కాదు మేము, ప్రపంచం మొత్తం కూడా ప్రభాస్ పెళ్లి కోసం వెయిట్ చేస్తోంది. దేవుడు ఒక స్త్రీకి, పురుషుడికి రాసి పెడతాడు. కాబట్టి ఆ శుభ గడియలు వస్తాయి. టైమ్ వచ్చినప్పుడు అన్నీ జరిగిపోతాయి, మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు అని శ్యామలా దేవి చెప్పుకొచ్చింది.
ప్రభాస్ ఇష్టపడే అమ్మాయిల వ్యక్తిత్వంపై కూడా శ్యామలా దేవి మాట్లాడటం విశేషం. మాది పెద్ద ఫ్యామిలీ, అందరితో కలిసిపోయే అమ్మాయి అంటే ప్రభాస్ ఇష్టపడతారు. వేరే వాళ్లని విమర్శించడం, నెగెటివ్ టాక్ చేసే వ్యక్తులంటే ప్రభాస్ కి నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్, మరో భారీ సినిమా ‘స్పిరిట్’ కూడా చేస్తున్నారు.
































