ప్రభాస్ ‘రాజాసాబ్’ రిలీజ్‌కి రెడీ.. మరి ఓటీటీల్లో?

రో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావుడి మొదలు కానుంది. ముందుగా ప్రభాస్ ‘రాజాసాబ్’ థియేటర్లలోకి రానుండగా.. దీంతో పాటే దళపతి విజయ్ చివరి మూవీ ‘జన నాయకుడు’ రిలీజ్ కానుంది.


తర్వాత రోజు తమిళ హీరో శివకార్తికేయన్ ‘పరాశక్తి’ థియేటర్లలో విడుదల కానుంది. ఇదే వారం ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి రాబోతున్నాయి.

ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే అఖండ 2, దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్ తదితర సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా సైలెంట్ క్రైమ్స్, హనీమూన్ సే హత్య లాంటి వెబ్ సిరీస్‌లు ఉన్నప్పటికీ రిలీజైతే గానీ వీటి సంగతి ఏంటనేది బయటపడదు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (జనవరి 05 నుంచి 11వ తేదీ వరకు)

నెట్‌ఫ్లిక్స్

డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ సిరీస్) – జనవరి 05

గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 07

ది రూకీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 08

హిజ్ అండ్ హర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 08

అఖండ 2 (తెలుగు సినిమా) – జనవరి 09

దే దే ప్యార్ దే 2 (హిందీ మూవీ) – జనవరి 09

ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 09

పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 09

కాట్ స్టీలింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 10

హాట్‌స్టార్

వెపన్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 08

ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 09

జీ5

మాస్క్ (తమిళ మూవీ) – జనవరి 09

జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ సినిమా) – జనవరి 09

హనీమూన్ సే హత్య (డాక్యుమెంటరీ సిరీస్) – జనవరి 09

సన్ నెక్స్ట్

సైలెంట్ క్రైమ్స్ (తెలుగు డాక్యుమెంటరీ) – జనవరి 08

సోనీ లివ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జనవరి 09

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.