Prashant Kishore | ఏపీలో జగన్‌ సర్కారుపై ప్రశాంత్‌ కిషోర్‌ ఆస్తకికర వ్యాఖ్యలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ జగన్‌ (CM Jagan) ప్రభుత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishore) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో జగన్‌ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్త పరిచారు. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.


ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన ప్రొవైడర్‌ మోడ్‌(Provider mode) లోనే ఉండిపోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని విమర్శించారు. ఆయన పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని వాటిలో ప్రజగలకు నగదు బదిలీ చేసి ఉద్యోగాలు కల్పించలేదని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌ మాదిరిగానే పనిచేశారని పేర్కొన్నారు.