ప్రపంచంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రదేశాలు ప్రకృతి అందాలకు నెలవైతే, మరికొన్ని వింత ఆచారాలకు ప్రసిద్ధి.
అలాంటి వాటిలో జమ్మూ కశ్మీర్‌లోని లద్ధాఖ్ పరిసరాల్లో ఉన్న గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పురుషులతో పిల్లల్ని కనడానికి విదేశీ మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మారుమూల గ్రామాలు ప్రగ్నెన్సీ టూరిజం హబ్స్‌గా మారాయి. దా, హనో, డార్చిక్, గార్కాన్ వంటి గ్రామాలలో బ్రోక్పా (Brokpa community) అనే ఒక తెగ ఉంది. వీరు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ సైనికుల వారసులు (Direct Descendants)గా భావిస్తారు. తామే చివరి, స్వచ్ఛమైన ఆర్యన్స్ (Last pure Aryans) అని గర్వంగా చెప్పుకుంటారు.
ఈ తెగలో స్ట్రిక్ట్ రూల్స్:
తెగ ప్రజలు చూడటానికి చాలా డిఫరెంట్‌గా ఉంటారు. మంచి ఎత్తు, నీలి రంగు కళ్లు, పొడవాటి జుట్టుతో అందంగా కనిపిస్తారు. అందుకే లద్ధాఖ్‌లోని మిగతా తెగల కంటే వీళ్లు చాలా స్పెషల్. వీరి జన్యువులు (Genes) ప్యూర్‍గా ఉండాలని, బయటి తెగల వారిని పెళ్లిళ్లు కూడా చేసుకోరు. ఇది ఈ తెగ స్ట్రిక్ట్ రూల్. వీరి డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన సాంగ్స్, డాన్సులు కూడా ఉన్నాయి. కాకపోతే, ప్రెగ్నెన్సీ టూరిజం లాంటి విషయాల వల్ల వీరి సంస్కృతి దోపిడీకి గురవుతోందని చాలా మంది అంటున్నారు.
బ్రోక్పా తెగ “స్వచ్ఛమైన ఆర్యన్” వారసులనే నమ్మకాన్ని కొందరు డబ్బు సంపాదించడానికి వాడుకుంటున్నారు. విదేశీ మహిళలను ఆకర్షించి, బ్రోక్పా పురుషులతో పిల్లలను కనడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది ఈ తెగ ప్రజల కల్చర్‌ను ఒక వ్యాపార వస్తువుగా మారుస్తోంది. బ్రోక్పా తెగ గురించి తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. వారి సంస్కృతిని వక్రీకరించి, కేవలం స్వచ్ఛమైన ఆర్యన్లు అనే కోణంలోనే చూపిస్తున్నారు. ఇది వారి నిజమైన సంస్కృతిని, చరిత్రను కప్పిపుచ్చుతోంది. మరోవైపు, ప్రెగ్నెన్సీ టూరిజం ద్వారా వచ్చే డబ్బు బ్రోక్పా తెగకు సరిగ్గా చేరడం లేదు. మధ్యవర్తులు, టూరిజం ఏజెంట్లు ఎక్కువ లాభం పొందుతున్నారు. ఇది ఈ తెగను ఆర్థికంగా దోపిడీ చేయడమే.
* ఇలా పిల్లల్ని కంటారట:
2006లో “ది ఆర్యన్ సాగా” అనే డాక్యుమెంటరీతో ప్రెగ్నెన్సీ టూరిజం విషయం లైమ్‌లైట్‌లోకి వచ్చింది. జర్మన్ మహిళలు బ్రోక్పా తెగకు చెందిన మగాళ్లతో పిల్లల్ని కనడానికి ఆ గ్రామాలకు వస్తున్నట్లు తెలిసింది. “ప్యూర్ ఆర్యన్ బ్లడ్” కోసమే వారు ఇలా చేస్తున్నారట. దీన్నే “ప్రెగ్నెన్సీ టూరిజం” అంటున్నారు. విదేశీ మహిళలు, స్థానిక పురుషులను సెలక్ట్ చేసుకుని, ప్రెగ్నెంట్ అయ్యే వరకు అక్కడే ఉండి, తర్వాత తమ దేశాలకు వెళ్లిపోతారు. ఇందుకు గాను ఆ పురుషులకు మంచి డబ్బు ఇస్తారట. దాంతో ఇది స్థానిక పురుషులకు ఒక ఇన్‍కమ్ సోర్స్‌లా మారింది.
* నో ఎవిడెన్స్:
అయితే, బ్రోక్పా ప్రజలు తమను తాము “స్వచ్ఛమైన ఆర్యన్” వారసులుగా చెప్పుకుంటున్నా, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేవు. వారి వంశాన్ని నిర్ధారించడానికి ఇప్పటివరకు ఎలాంటి DNA పరీక్షలు జరగలేదు. వారు కేవలం తమ శారీరక రూపం, పూర్వీకుల కథనాలు చూపిస్తూ అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికులకు తాము స్వచ్ఛమైన వారసులమని చెప్పుకుంటున్నారు.
ఇంటర్నెట్ పెరగడం, టూరిజం ఏజెంట్లు ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువైంది. కొందరు ఏజెంట్లు అయితే, ఆసక్తి ఉన్న మహిళలకు, అర్హులైన పురుషుల వివరాలు కూడా ఇస్తున్నారట. పురుషుల అందాన్ని బట్టి ఫీజులు కూడా మారుతున్నాయట.