హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..

www.mannamweb.com


చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ 200 సిరీస్‌లో భాగంగా హానర్‌ 200, హానర్‌ 200 ప్రో 5జీ ఫోన్‌లను తీసుకొచ్చారు.

ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ధర విషయానికొస్తే హానర్‌ 200 8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,999గా నిర్ణయించారు. అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999గా నిర్ణయించారు. ఇక హానర్‌ 200 ప్రో విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో బాగంగా ఈ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే డిస్కౌంట్‌లో భాగంగా అదనంగా మరో రూ. 8 వేల వరకు తగ్గింపు ధర లభించే అవకాశం ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే హానర్‌ 200 5జీ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7 ఇంచెస్‌ ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ కర్వ్డ్ డిస్ ప్లేను ఇవ్వనున్నారు. అలాగే హానర్ 200 ప్రో 5జీ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. హానర్ 200 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్లతో పని చేస్తాయి.

కెమెరా విషయానికొస్తే హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా, 12 -మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందించారు. సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ లో అదనంగా 3డీ డెప్త్ కెమెరాను ఇచ్చారు.