ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలంటే 15-20 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రూ. 10 వేల లోపు ధరకే 5G స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరలోనే 5G స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అడ్వాన్డ్స్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అదిరే ఫీచర్స్ తో మొబైల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ న్యూ 5G మొబైల్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది.
అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Redmi A4 5Gని లాంచ్ చేసింది. రూ. 8499కే రెడ్ మీ 5G ఫోన్ లభించనున్నది. ఈ కొత్త 5G ఫోన్ డిజైన్, ఫీచర్లు, బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. రెడ్ మీ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. పనితీరు, క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ కెపాసిటీ అద్భుతంగా ఉండటంతో రెడ్ మీ ఫోన్స్ సేల్స్ లో దూసుకెళ్తుంటాయి. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ కావాలనుకునే వారికి Redmi A4 5G ఫోన్ బెస్ట్ ఆప్సన్ గా చెప్పొచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. దీని 4GB + 64GB వేరియంట్ ధర రూ. 8499గా కంపెనీ నిర్ణయించింది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ స్టార్రీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ కలర్ ఆప్షన్ లో లభించనున్నది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.
ఈ ఫోన్ Snapdragon 4S Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్ అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 14OSలో నడుస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా అందించారు. ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్‌లో సైడ్‌మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ తో 5160mAh బ్యాటరీ సామార్ధ్యాన్ని కలిగి ఉంది. తాజాగా లాంచ్ అయిన ఈ ఫోన్ నవంబర్ 27 నుండి mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.