ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులే .. జాబ్‌ మానేస్తున్నారు: ఆర్‌బీఐ

www.mannamweb.com


ప్రైవేట్ బ్యాంక్‌ ఉద్యోగులు రాజీనామాలు చేయడం పెరుగుతోంది. ఈ సెక్టార్‌లో అట్రిషన్ రేటు ( వాలంటరీగా ఉద్యోగులు జాబ్‌ మానేయడం) 25 శాతానికి చేరుకుందని ఆర్‌బీఐ తన లేటెస్ట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఇలానే కొనసాగితే ప్రైవేట్ బ్యాంకుల్లో కార్యకలాపాలు సాఫీగా సాగడం కష్టమని అభిప్రాయపడింది. ఉద్యోగుల అట్రిషన్ రేటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువగా ఉందని బ్యాంకింగ్ సెక్టార్‌ 2023-24 రిపోర్ట్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.

ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, కానీ అట్రిషన్ రేటు కూడా గత మూడేళ్లలో బాగా పెరిగిందని వివరించింది. ఉద్యోగులను జాయిన్ చేసుకునే ప్రాసెస్‌ మెరుగుపరచాలని, వీరికి బాగా ట్రెయినింగ్ ఇవ్వాలని, కెరీర్‌ను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందించాలని, ఇతర ఎంప్లాయీ బెనిఫిట్స్‌ను కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. కొన్ని బ్యాంకుల్లో గోల్డ్‌ లోన్లు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్నాయని, పాలసీలను సరిగ్గా రివ్యూ చేయాలని తెలిపింది.