Visakhapatnam: మేనమామ లేనిలోటు తీర్చేందుకు..విగ్రహం తో కార్యక్రమము

www.mannamweb.com


పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తోంది.

పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తోంది. కాలం కలిసిరాక మేనమామ దూరమైనా.. ఆ లోటు తెలియకుండా అనకాపల్లిలో ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అనకాపల్లి గవరపాలేనికి చెందిన పెంటకోట కిరణ్‌ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవారు. 2020లో విద్యుతాఘాతానికి గురై మృతిచెందారు. ఈయన అక్క మాధవి కుమార్తె లాస్య పుష్పవతి వేడుకలు అనకాపల్లిలో ఆదివారం నిర్వహించారు.

పుట్టింటి నుంచి లాంఛనాలను మాధవి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ సమయంలో తన తమ్ముడు కిరణ్‌ విగ్రహాన్ని తల్లిదండ్రులకు చూపించి సోదరుడిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారామె. మేనమామ చేతులమీదుగా పుట్టింటి లాంఛనాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో ముంబయిలో విగ్రహాన్ని తయారు చేయించినట్లు మాధవి తెలిపారు. మేనమామ చేతుల మీదుగానే పుట్టింటి నుంచి వచ్చిన వస్తువులను లాస్యకు అందజేసేలా చేయాలన్న ప్రయత్నం కుటుంబ సభ్యులందరినీ సంతోష పెట్టింది.