Pulipiri Removal: పులిపిర్లు ఉన్నాయా? ఇలా చేస్తే కేవలం 5 నిమిషాల్లో చెక్‌!

Pulipiri Removal In 5 Minutes: ప్రస్తుతం చాలా మందిలో ముఖం, చేతులు, కాళ్లు, మెడ, వీపు లాంటి ప్రదేశాల్లో పులిపిర్లు పెరుగుతున్నాయి. ఇవి శరీరానికి ఎలాంటి హాని, నొప్పి కలిగించకపోయి చూడడానికి అందహీనంగా కనిపిస్తూ ఉంటాయి.
కాబట్టి చాలా మంది దీని నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన చికిత్సలను చేయించుకుంటారు. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే పలు రకాల రసాయనాలతో కూడిన స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్‌లను కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇక నుంచి పులిపిర్ల నుంచి ఉపశమనం పొందడానికి డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు. కొన్ని ఇంటి చిట్కాలు వినియోగించి సులభంగా వీటి నుంచి విముక్తి పొందవచ్చు.


వెల్లుల్లి పేస్ట్:
వెల్లుల్లి పేస్ట్‌లో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు పులిపిర్ల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే అతిగా పులిపిర్లు ఉన్నవారు వెల్లుల్లి రెబ్బలను మిశ్రమంలా తయారు చేసుకుని, వాటిపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచితే చాలు సులభంగా ఉపశమనం లభిస్తుంది.

అలోవెరా జెల్:
అలోవెరా జెల్‌లో కూడా చర్మానికి కావాల్సి చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి పులిపిర్లు ఉన్నవారు కలబంద ఆకుల నుంచి తీసిన జెల్‌ని వాటిపై అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఈ రెమెడీని రోజుకు 3 నుంచి 4 సార్లు వినియోగించడం వల్ల సులభంగా పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

బేకింగ్ సోడా:
పులిపిర్ల నుంచి ఉపశమనం పొందడానిక బేకింగ్ సోడా కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. దీని కోసం ముందుగా ఒక చెంచా బేకింగ్ సోడాను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని ఆముదం నూనెలో వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పులిపిర్లపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:
పులిపిర్లను తొలగించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కీలక పాత పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని విరియోగించడానికి ముందుగా 2 చెంచాల యాపిల్ సైడర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న కాటన్ బాల్ చేసి దానిని సైడర్‌లో డిప్‌ చేసి పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా విముక్తి లభిస్తుంది.