శ్రష్టి వర్మ మొదట్లో ఒక షోలో పాల్గొంది.
తర్వాత పలు సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ కింద పని చేసింది.
జానీ మాస్టర్ హీరోగా నటించిన యథా రాజ తథా ప్రజ చిత్రంలో హీరోయిన్‌గానూ నటించింది.
ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్‌గా ఫుల్ బిజీగా ఉంది.
పుష్ప 2 సినిమాలో టైటిల్ సాంగ్ పుష్ప.. పుష్ప.. పాటకు విజయ్ పోలకితో పాటు శ్రష్టి కూడా కొరియోగ్రఫీ చేసింది.
పుష్ప.. పుష్ప ఫుల్ వీడియో సాంగ్ బుధవారం రిలీజైంది.
ఈ సందర్భంగా శ్రష్టి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
పుష్ప 2 మూవీతో నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాను అని రాసుకొచ్చింది.
డైరెక్టర్ సుకుమార్ ఆమెకు ఆప్యాయంగా ముద్దు పెడుతున్న ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది.