అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజయిన మొదటి రోజు నుంచి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నార్త్ లో పుష్ప హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ సినిమా భారీ అంచనాలతో రిలీజయింది.
అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ అయింది పుష్ప 2 సినిమా. సినిమాలోని యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ నటన, ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు.
దగ్గర పడుతుంటే ఈ ఇబ్బందులు ఏంటి?
ఇక కలెక్షన్స్ విషయంలో మొదటిరోజు నుంచి పుష్ప 2 రికార్డులు సెట్ చేస్తుంది. మొదటి రోజే 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మూడు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ దాటింది. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2 సినిమా. ఇక బాలీవుడ్ లో అయితే కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.
నెల రోజులు అయినా బాలీవుడ్ లో ఇంకా ఈ సినిమాకు హైప్ తగ్గట్లేదు. కేవలం హిందీ వర్షన్ సినిమానే 800 కోట్లకు పైగా కలెక్టు చేసి బాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. తాజాగా పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది. పుష్ప 2 సినిమా 32 రోజుల్లో 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అదిరిపోయే పోస్టర్ విడుదల..
ఇప్పటివరకు అత్యథిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమా 2000 కోట్లతో అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఉంది. సెకండ్ ప్లేస్ లో 1810 కోట్లతో ప్రభాస్ బాహుబలి 2 సినిమా ఉంది. ఇప్పుడు పుష్ప 2 బాహుబలి 2 సినిమా రికార్డుని బద్దలుకొట్టి 1831 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే ఊపులో దంగల్ రికార్డ్ కూడా బద్దలుకొట్టి మరో సరికొత్త అధ్యాయానికి పుష్ప 2 తెర లేపుతుందేమో చూడాలి.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఈ పుష్ప 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఉంది. ఇటీవలే అల్లు అర్జున్ అయిదేళ్ల నుంచి పుష్ప కోసం పెంచిన జుట్టు, గడ్డం తీసేసి కొత్త లుక్ లో కనపడ్డారు. బన్నీ కొత్త లుక్ కూడా బాగా వైరల్ అయింది. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.