టమాటా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు.. కారణమిదే.!

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల విశాఖ రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు కిలో టమాటా 100 విక్రయించారు. ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ… హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒక్కసారిగా భగ్గుమన్న టమాటా ధరతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.

మార్కెట్‌లో టమాటా ధర పెరుగుదలతో అధికారులు రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. టోకున కొన్న ధరకే రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు చేపట్టారు. లాభం నష్టం లేకుండా ప్రజలకు రైతు బజార్లలో అందుబాటులో పెట్టారు.

ఉదయం నుంచి క్యూ లైన్లు.. ఎగబడుతున్న జనం..

విశాఖలో టమాటాకు భారీ డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్లో 80 రూపాయల వరకు కిలో టమాట ధర పలుకుతుంది. ఈ వారంలో విశాఖలో టమాటా కిలో ధర సెంచరీ కూడా చేరింది. దీంతో.. రైతు బజార్లలో 48 రూపాయలకే అందుబాటులో పెట్టింది ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని రైతు బజార్లలో ఈరోజు కిలో 48 రూపాయలకు టమాట అమ్మకాలు చేస్తున్నారు. 13 రైతు బజార్లలోను సబ్సిడీపై విక్రయిస్తున్నారు. సబ్సిడీ టమాటా కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్లు ఉన్నాయి. 48 రూపాయల టమాటాను ఎగబడి కొంటున్నరూ జనం.

నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఉదయం నుంచి జనం క్యూ లైన్ లో నిలిచిన మరీ సబ్సిడీ టమాట కొనుగోలు చేస్తున్నారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున టమాటా ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. టమాటా ధరలు తగ్గేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా మార్కెటింగ్ శాఖ ద్వారా తగ్గించిన టమాటాను విక్రయిస్తామని అంటున్నారు నరసింహ నగర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ చినబాబు.