తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌ని కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి.
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని మన్యం జిల్లాలో నీళ్లు గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా.. కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల వెదర్ రిపోర్ట్ తెలుసుకోండి.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:-
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది .
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు
సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.




































