ఒకేసారి రెండు అల్పపీడనాలు.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనాలతో సోమవారం ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది


అటు బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలోని కొమరం భీం, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.