భారత ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం (Rajagopal Chidambaram) శనివారం కన్నుమూశారు. ఆయనకు ప్రస్తుతం 88 ఏళ్లు. అణ్వాయుధ కార్యక్రమంతో సంబంధం ఉన్న చిదంబరం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 3.20 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. చిదంబరం 1975 నుంచి 1998 మధ్య కాలంలో అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.
శాస్త్రవేత్త నుంచి..
శాస్త్రవేత్తగా తన కెరీర్ ప్రారంభించిన డాక్టర్ చిదంబరం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1994-95 సమయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) గవర్నర్స్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ చిదంబరం భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. ఆ క్రమంలో అనేక అణు పరీక్షల సమయంలో తన సేవలను అందించారు. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించాలనే ప్రతిపాదకుడు, భారతదేశ అణుశక్తి కార్యక్రమాన్ని వేగవంతం చేశారు