రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడంటే

www.mannamweb.com


కొన్ని సార్లు భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమాలు.. ఊహించని విధంగా ప్లాప్ అవుతూ ఉంటాయి. అందులో భారీ తారాగణం ఉన్నా.. లేదా పాపులర్ డైరెక్టర్ తీసినా సరే.. కథలో కంటెంట్ లేకపోతే మాత్రం ఆ సినిమా డిజాస్టర్ గానే నిలుస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధిచిన విషయాలు చూసేద్దాం.

రజిని కాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.. దర్శకత్వం వహించిన మూవీ లాల్ సలామ్. ఈ సినిమాను సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించి భారీ అంచనాల మధ్యన థియేటర్ లో ఫిబ్రవరి 9న థియేటర్ లో రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలకు దాదాపు రూ.70 కోట్ల పైనే నష్టాన్ని మిగిల్చింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ పలు ఇంటర్వూస్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ మిస్ అయిందని.. అవి కూడా యాడ్ అయ్యి ఉంటే సినిమా నెక్ట్ లెవెల్ లో ఉండేదని చెప్పిన కామెంట్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ , సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి లాల్ సలామ్ సినిమా సన్ నెక్ట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో డిజాస్టర్ అయినా సినిమాలు కూడా.. ఓటీటీ లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. కాబట్టి.. ఈ సినిమా విషయంలోనూ ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక బిజినెస్ మ్యాన్, తన కొడుకును ఓ మంచి క్రికెటర్ గా చూడాలనేదే అతని కల. కానీ ఊరిలో క్రికెట్ మ్యాచ్ కారణంగా జరిగిన గొడవ మతకలహాలకు దారితీస్తుంది. ఈ గొడవలో రజిని కాంత్ కొడుకు చేతిని గురు అనే వ్యక్తి నరికేస్తాడు. అసలు ఆ గురు ఎవరు ? ఆ గొడవ ఏంటి ? రజినీకాంత్ అతని కొడుకుకు జరిగిన అన్యాయం గురించి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.