ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు.
మార్ఫింగ్ ఫొటోలు పెట్టిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆర్జీవీని పోలీసులు విచారిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురు నేతల ఫొటోలను డైరెక్టర్ రాంగోపాల్ శర్మ మార్ఫింగ్ చేసినట్లుగా టీడీపీ నేత రామలింగం ఒంగోలు జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్జీవీకి నోటీసులు పంపారు. అయితే, కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా ఈ నెల 4న విచారణకు రావాలని పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వగా.. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ మేరకు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు