రామ్ గోపాల్ వర్మ అరెస్ట్..? ముందస్తు బెయిల్ పై హై కోర్టు సంచలన తీర్పు!

www.mannamweb.com


కూటమి అధికారంలోకి రాకముందు రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై అనేక మార్ఫింగ్ ఫోటోలు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసినందుకు గానూ, ఆయనపై ఒంగోలు పోలీసులు ఐటీ చట్టం క్రింద కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

వర్మ అరెస్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉండడాన్ని గమనించి హై కోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటీషన్ ని విచారించిన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఈ నెల 26వ తేదికి వాయిదా వేసింది. తెలుగు దేశం పార్టీ జెనెరల్ సెక్రటరీ ముత్తనపల్లి రామలింగయ్య వారం రోజుల క్రితం ఒంగోలు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ వేసిన అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలను ఆధారాలతో సహా పోలీసులకు అందించడంతో, వాటిని ఆధారంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ పై FIR నమోదు చేసారు. ఈమేరకు పోలీసులు ఆయనని విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

విచారణ లో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సమాదానాలు చెప్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక పాపులర్ సెలబ్రిటీ హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలను ఒక బీ గ్రేడ్ మనిషిగా దిగజారి తన ట్విట్టర్ అకౌంట్ లో వేయడం అత్యంత నీచమైన చర్య. వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, తానూ ఏమి చేసిన చెల్లుబాటు అవుతుంది, మరో పదేళ్ల పాటు జగన్ సీఎం గా ఉంటాడు, నా ఇష్టమొచ్చినట్టు వ్యవహరించొచ్చు అనే ధోరణి లో రామ్ గోపాల్ వర్మ వ్యవహరించేవాడు. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, ఇక మీదట పొలిటికల్ సినిమాలు కానీ, పొలిటికల్ సెటైర్లు కానీ వెయ్యను అంటూ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించి చాలా తెలివిగా తప్పించుకోవాలని చూసాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా చేస్తే ఆయన చేసిన తప్పులను క్షమిస్తారని అనుకోని ఉండుంటాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా క్షమిస్తాడేమో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం అసలు క్షమించే ప్రసక్తే లేదు అనే ధోరణితో ఉన్నాడు. ఇటీవల కాలం లో హోమ్ మినిస్టర్ అనిత పై ఆయన అసహనం వ్యక్తం చేసినప్పటి నుండి ఇలా సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు పైశాచికంగా ప్రవర్తించే వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఈ కేసు నుండి ఆయన ఎలా తప్పించుకుంటాడో చూడాలి. రీసెంట్ గా మాజీ సీఎం జగన్ కూడా రామ్ గోపాల్ వర్మ పై నమోదైన కేసు గురించి మాట్లాడుతూ, ఇది చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన ఈ వీడియోపై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి.