Gooty Fort-చరిత్ర ప్రసిద్ది చెందిన గుత్తికోట- History of Gooty Fort | Anantapur
చరిత్ర ప్రసిద్ది చెందిన గుత్తికోట అనంతపురము జిల్లాలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి. అలనాటి రతనాల సీమగా పిలువబడిన రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్నూలు, అనంతపురము జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పు దిశలో 300 మీటర్ల ఎత్తున కొండలపై నిర్మించిన గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా విలసిల్లుతోంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయి. మురారి రావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. కోటలో చాలా నూతులున్నవి ఆంధ్రుల పరాక్రమ వైభవానికి, శిల్పుల సాధనిర్మాణ కళా కౌశలానికి మౌన సాక్షిగా నిలిచి మూడు వైపులా భారీ విస్తీర్ణంలో కోటను నిర్మించారు. ప్రారంభంలోనే పెద్ద కందకం ఉంటుంది. అక్కడి నుండి కోట ప్రారంభం అవుతుంది.
ఆ తరువాత సింహద్వారం, నగరేశ్వర ఆలయం. రెండవ ద్వారం దాటి పైకి వెళితే సైనికులకుద్దేశించి విశాలమైన మైదానం. అక్కడ గజశాలలు, అశ్వశాలలు ఉంటాయి.మరికొన్ని ద్వారాలు దాటితే రాజ్యోగుల నివాస గృహాల ఆనవాళ్లు కనిపిస్తాయి. కోటలో హిందూ రాజుల నాట్యశాలగానూ, మహమ్మదీయుల మసీదుగానూ ఉపయోగించే రంగమండపం ఉంది. వాటిలో వర్ణ చిరత్రాలు నేటికీ వన్నె తగ్గలేదు. మండపం దాటగానే రాజకీయ సౌందర్యాన్ని పుచ్చుకొన్న ఒక మండపం ఉంది. దాన్ని బేగం మహల్ అంటారు. దాని సమీపంలో మురారిరావు గద్దె, సభాభవనం తదితర భవనాలు ఉంటాయి. తరువాత ఖిల్లా అనే శిఖరాగ్ర భాగం ఉంటుంది. ఆ శిఖరం నుంచి కిందికి చూస్తే చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం 50 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. శత్రువులను దెబ్బతీయడానికి కోటను నిర్మించారు. ప్రాకారంపై నుంచి శత్రువులకు కనిపించకుండా దాక్కొని కోట దెబ్బతినకుండా రాళ్లు దొర్లించడానికి వీలుగా నిర్మాణం జరిగింది. దుర్గంలో మంచినీటికి 101 బావులు ఏర్పాటు చేశారు. ఈ దుర్గం నిర్మాణం వైశిష్ట్యాన్ని చూసిన విల్స్ అనే చరిత్రకారుడు క్షామం, మోసం ఇవి రెండు మాత్రమే దుర్గాన్ని లొంగదీయగలవని తన పుస్తకంలో వ్యాఖ్యానించాడు. గుత్తి సమీపంలో గౌతముడు అనే మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానిలో నివసించాడు. గౌతముని పేరు మీద గౌతమపురం అని దీనిని పిలిచేవారు. అది కాలక్రమేణా గుత్తిగా మార్పు పొందిందని ఒక ఐతాహ్యం. గుత్తికోట చుట్టూ ఉన్న గుట్టలతో కలిపి చూడటానికి పుష్పగుచ్ఛం ఆకారంలో ఉన్నందున దీనిని పూగుత్తి అని తరువాత గుత్తి అని పిలిచేవారని ఒక కథనం. ఈ ప్రాంతాన్ని మొదట శాతవాహనులు పాలించారు. అనంతరం బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటములు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు. కోటగోడను 11, 12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది.
గుత్తి కొట పూర్వ చరిత్ర
గుత్తికోటకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. కాలం పుటలను వెనుక్కు తిప్పితే మెరిసిపోయే గాథలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండువేల ఐదు నుంచి తొమ్మిది వందల వరకు గుత్తి దుర్గంలో జన నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. రాతి యుగం అవశేషాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డాయి. అలనాటి మనుషులు నివాసం ఉన్న గృహాలను బ్రిన్ పూల్ అనే బ్రిటిష్ వ్యక్తి బహిరంగ పరిచాడు. అనాటి పనిముట్లు శిథిలాలు ఉరవకొండ మండలంలోని లత్తవరం, విడపనకల్లు మండలంలోని కరకముక్కల ప్రాంతాల్లో కూడా బయటపడ్డాయి. క్రీ.పూ.260 నుంచి మాత్రం దీని విశేషాలు క్రమ పద్దతిలో వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ.220 నుంచి 200 వరకు శాతవాహనులు పాలించినట్లు తెలుస్తోంది. అనంతరం బాదామి చాళుక్కులు, రాష్ట్ర కూటములు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు. కాగా కోట గోడను 11,12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది. కోటలో కనిపించే సంస్కృత శ్లోకాన్ని బట్టి హరిహర బుక్కరాయలు గుత్తిని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తోంది. బుక్కరాయల కాలంలోనే కోట శంకాకృతిని సంతరించుకుందని తెలుస్తోంది. విజయనగర రాజుల హయాంలో కోటతో గొప్ప వెలుగు పొందింది. నరసింహరాయులు హయాం నుంచి వారి స్వాధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగర పాలకుల చిహ్నమైన గజలక్ష్మి చిత్రం అన్ని ద్వారాలపై ప్రముఖంగా కనిపిస్తుంది. రాయల మరణాంతరం వారసత్వ తగాదాల వివాదంలో గుత్తి కోటకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పాజిగా ప్రసిద్ధుడైన తిమ్మరుసులు తమ బాల్యాన్ని గుత్తిలో గడిపినట్లు ఆధారాలు ఉన్నాయి. విజయనగరరాజుల వివాదంలో సామ్రాజ్యానికి వారసులైన సదాశివరాయలను మంత్రి శలకం తిమ్మయ్య కుట్ర చేసి ఈ కోటలోనే బంధించాడు. తరువాత రామ రాయలులు గుత్తిపై దండెత్తి వచ్చి సదాశివరాయులను విడిపించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బిజాపూర్ నవాబులు పాలించారు. క్రీ.పూ.1650 ప్రాంతంలో నల్గొండ నవాబులు కుతుబ్ షాహి అధికారులైన మీర్ జుమ్లా అనేక నెలలు ముట్టడి తరువాత కోటను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఔరంగజేబు దాడుల్లో గుత్తి మొగలాయిల వశమైంది. క్రీ.పూ.1750 ప్రాంతంలో మరాఠీరాజు గుత్తిని స్వాధీనం చేసుకొన్నాడు. క్రీ.శ 1762లో హైదర్ ఆలీ గుత్తిపై దండెత్తి ఆరు నెలలు ముట్టడి సాగించినా గెలుపు పొందలేక వెనుదిరిగి మరో దండయాత్రలో స్వాధీనం చేసుకొన్నాడు. . 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు గుత్తి దుర్గానికి పేరు రావడం వెనుక అనేక కథలు ఉన్నాయి. సమీపంలో గౌరి గుట్టమీద గౌతమ మహర్షి తపస్సు చేసినందున గౌతమీపురంగా ఏర్పడి కాలక్రమేణా గుత్తిగా మారిందని ప్రజల నమ్మకం. కాగా 9,10 శతాబ్దాలలో నొలంబావడి అని పేరు ఉన్నట్లు హేమావతి, మడకశిర శాసనాలు తెలుపుతున్నాయి. కాగా గుత్తి దుర్గం పాలకులుగా ఉన్న మురాఠీరావు మనవడు వారి వారసుడైన ఘోర్పడే 1984లో గుత్తి దుర్గాన్ని సందర్శించాడు