గోదావరి జిల్లాలో రేవ్ పార్టీల కలకలం.. అర్ధనగ్న దుస్తులతో మహిళల డాన్సులు

www.mannamweb.com


గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఔట్‌లో రేవు పార్టీ జరిగినట్టుగా నెట్టింట వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా.. వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలతో యువకులు, పెద్దలు నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఓ జనసేన నాయకుడు అసభ్య నృత్యాలతో ఈ రేవు పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబరు 31 రాత్రి వేడుకలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జనసేన నేతల న్యూ ఇయర్ రేవ్ పార్టీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జనసేన నేతలపై కేసులు నమోదు చేయొద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి వస్తోందని సమాచారం.