బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంక్ యూసీఓ (UCO) బ్యాంక్‌పై పెద్ద చర్య తీసుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, దాని సూచనలను పాటించనందున ఆర్బీఐ యూసీవో బ్యాంక్‌పై రూ.
2,68,30,000 జరిమానా విధించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 26, 2024న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, UCO బ్యాంక్‌పై రూ. 2,68,30,000 జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. యూసీవో బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 26A నిబంధనలను ఉల్లంఘించినందుకు అడ్వాన్స్‌లపై వడ్డీ రేట్లు, బ్యాంక్ కరెంట్ ఖాతాలలో క్రమశిక్షణ, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, మోసం, వాణిజ్య బ్యాంకుల రిపోర్టింగ్, తదితర కారణాల వల్ల ఈ జరిమానా విధించింది. ఆర్థిక సంస్థలు డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సూచనలను పాటించనందున ఈ చర్య తీసుకుంది. యూకో బ్యాంకుకు ఇచ్చిన అధికారాల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
బ్యాంకు పర్యవేక్షక విచారణ అనంతరం దానికి నోటీసు కూడా జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదని బ్యాంకుకు పంపిన నోటీసులో ప్రశ్నించింది. నోటీసుకు బ్యాంక్ ప్రతిస్పందన తర్వాత, పెనాల్టీ వేసింది. ఆ తర్వాత యూసీవో బ్యాంక్‌పై ద్రవ్య పెనాల్టీ విధించింది.
యూసీవో బ్యాంక్ తన ఫ్లోటింగ్ రేట్ వ్యక్తిగత రిటైల్ రుణాలు, బాహ్య బెంచ్‌మార్క్‌లతో MSMEలకు ఇచ్చిన రుణాలను బెంచ్‌మార్క్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ గుర్తించింది. అయితే ద్రవ్య పెనాల్టీ విధించడం వల్ల బ్యాంకుపై చేపట్టే ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది.