ఈ క్రమంలో ఈ భారీ రేటు కూడా క్రెడిట్ సైకిల్ ను పునరుద్ధరించడానికి బాగా సహాయపడుతుందని ఎస్బిఐ స్పష్టం చేసింది. మొత్తం రేటు కూడా 100 బేసిస్ పాయింట్లకు పెరిగే అవకాశం కూడా ఉందని తన నివేదికలో తెలిపింది.
మేమందరం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 6న జరగబోయే ద్రవ్యపరపతి విధాన కమిటీ ప్రకటనలో 50 బేసిస్ పాయింట్ రేటు కోత విధిస్తుందని ఆశిస్తున్నాము అని ఎస్బిఐ తెలిపింది. ఇది క్రెడిట్ సైకిల్లో ఉత్తేజ పరుస్తుంది. ఈ క్రమంలో దేశీయ ద్రవ్యత మరియు ఆర్థిక స్థిరత్వం ఆందోళనలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆర్బిఐ అంచనాలకు తగినట్లుగానే ద్రవ్యోల్బణం కూడా ఉంది. వృద్ధి వేగం పెరుగుతుంది.
మనదేశంలో ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఎక్కువ వర్షం కురుస్తుందని ముందుగానే అంచనా వేయడం అలాగే పంటలు బాగా పండడం, ముడిచమారు ధరలు కూడా తగ్గడం వంటి ఇతర సానుకూల పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. దేశంలో వచ్చిన ఈ మార్పులు అన్నీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎస్బిఐ సిపిఐ ద్రవయోల్బన అంచనాను 3.5 శాతానికి సవరించడానికి దారితీస్తుందని తాజాగా తన నివేదికలో ఎస్బిఐ తెలిపింది. మన దేశ జిడిపి ఈ ఏడాది మార్చి తో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో 7.4% వృద్ధి చెందినట్లు తెలిపింది. గత ఏడాది ఇది 8.4% గా ఉంది.
మూలధన నిర్మాణంలో జరిగిన పెరుగుదల దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని బ్యాంకులు కూడా తమ బ్యాంకులో ఉన్న పొదుపు ఖాతాలపై 2.70 శాతం వడ్డీ రేటులను ఫ్లోర్ రేటుకు తగ్గించాయి. ఫిక్స్ రెడ్డిపాజిట్ లపై కూడా 30 నుంచి 70 బేసిస్ పాయింట్లు బ్యాంకులు కోత విధించాయి. రానున్న త్రైమాసికంలో కూడా డిపాజిట్ల రేటు కోతల బదిలీ చాలా బలంగా ఉంటుందని ఎస్బిఐ తన నివేదికలో తెలిపింది. జూన్ 4వ తేదీన కీలక వడ్డీ రేటులను నిర్ణయించే ద్రవ్యపరపతి విధాన కమిటీ ప్రారంభం కానుంది. ఎంపీసీ నిర్ణయాలను జూన్ 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు తెలుపనున్నారు.
































