రియల్‌మీ 14 ప్రో సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. Realme 14 Pro, Realme 14 Pro+ . రెండు స్మార్ట్‌ఫోన్‌లు రంగు మార్చే బ్యాక్ ప్యానెల్‌లను కలిగి ఉంటాయి. అయితే 14 ప్రో సిరీస్ కవర్లు మారుతాయి. ఉష్ణోగ్రత 16°C లేదా అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే రంగు మారుతుందని గుర్తించుకోండి. ఈ మొబైల్స్ త్వరలో భారత్‌లో విడుదల కానున్నాయి. మరి ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా
రియల్‌మీ 14 ప్రో సిరీస్ జనవరి 2025లో భారతదేశంలో లాంచ్ కానుంది. అధునాతన టెక్నాలజీతో ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. వివిధ నివేదికల సమాచరాం ప్రకారం.. ఇది ప్రత్యేకమైన రంగును మార్చే బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ వెనుక ప్యానెల్ అధునాతన థర్మోక్రోమిక్ పిగ్మెంట్‌లతో తయారు చేసి ఉంటుంది. ఇవి ఉష్ణోగ్రతలో మార్పులతో వాటి రంగును మారుస్తాయి. ఉష్ణోగ్రత 16°C కంటే తక్కువగా పడిపోయినప్పుడు, వెనుక కవర్ పెర్ల్ వైట్ నుండి వైబ్రెంట్ బ్లూకి మారుతుంది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ అది మళ్లీ అదే రంగులోకి మారుతుంది.
Realme 14 Pro డిజైన్, ఫీచర్లు:
Realme 14 Pro సిరీస్‌లో యూనిక్ పెరల్ డిజైన్ ఉంటుంది. దీనిలో పెర్ల్ వైట్ వేరియంట్ ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ ఆకృతి సీషెల్ పౌడర్ నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇది 8 మిమీ కంటే తక్కువ క్వాడ్-వంపు ప్రొఫైల్, మిరుమిట్లు గొలిపే ముత్యం లాంటి షైన్‌ను కలిగి ఉంటుంది. ప్రతి ఫోన్ వెనుక ప్యానెల్‌పై భిన్నమైన నమూనా ఉంటుంది. ఇది సహజమైన సముద్రపు షెల్‌ల వలె కనిపిస్తుంది.
అదనంగా ఈ శ్రేణి ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుంది. ఇది 30 డిగ్రీల “ఫ్యూజన్ ఫైబర్” ప్రక్రియ ద్వారా దీనిని తయారు చేశారు. ఇందులో 95% పర్యావరణ అనుకూలమైన, బయో ఆధారిత పదార్థాలను ఉపయోగించారు. ఈ డిజైన్ వర్క్స్ కారణంగా, స్మార్ట్‌ఫోన్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉంటుందట. ఇది వినియోగదారుకు ప్రీమియం అనుభవాన్ని ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Realme 14 Pro+ స్పెసిఫికేషన్‌లు:
Realme 14 Pro+ సెగ్మెంట్-ఫస్ట్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ రేషియో 93.8% కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే వినియోగదారులకు ఎడ్జ్ స్వైపింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అదనంగా ఇది ఓషన్ ఓకులస్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో కొత్త మ్యాజిక్‌గ్లో ట్రిపుల్ ఫ్లాష్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫ్లాష్ తక్కువ వెలుతురులో కూడా బెస్ట్ ఫోటోలను తీస్తుంది. అలాగే రాత్రిపూట అద్భుతమైన పోర్ట్రెయిట్‌లను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో IP66, IP68, IP69 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది వాటర్, దుమ్ము నుండి సురక్షితంగా ఉంటుంది. Realme 14 Pro సిరీస్ వినూత్న డిజైన్, గొప్ప ఫీచర్లతో వినియోగదారుకు గొప్ప అనుభవాన్ని అందిస్తుందని చెబుతోంది.