రూ.6వేలలోపే రియల్‌మీ ఫోన్.. త్వరలో మార్కెట్లోకి.. ఇదిగో ఫీచర్లు

www.mannamweb.com


బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో మీరు రియల్‌మీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. త్వరలో ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇందులో ఫీచర్లు కూడా బాగున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం..

రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఈ ఫోన్ పేరు రియల్‌మీ నోట్ 60. తాజాగా లీకైన లీక్‌లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ వెల్లడయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించిన లైవ్ ఫోటోలతో రెండర్స్.. లాంచ్ డేట్‌ను షేర్ చేసింది. రియల్‌మీకి చెందిన ఈ ఫోన్ సెప్టెంబర్ 5న గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్‌లో అనేక గొప్ప ఫీచర్లను కంపెనీ అందించబోతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఫీచర్లు

లీకైన నివేదిక ప్రకారం, కంపెనీ ఈ ఫోన్లో 6.74 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించబోతోంది. ఫోన్‌లో అందించే ఈ డిస్ ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ లభిస్తుంది. ప్రాసెసర్‌గా యూనిసోక్ టైగర్ టీ612 చిప్ సెట్‌ను ఈ ఫోన్ లో అందించనుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌కు ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వవచ్చు. ఇందులో ప్రధాన కెమెరా 32 మెగాపిక్సెల్.

దీంతోపాటు ఫోన్ వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కూడా చూడొచ్చు. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందించబోతోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 10 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మధ్య ఉండొచ్చని అంచనా.

రియల్‌మీ 13 సిరీస్ ఫోన్లు

రియల్‌మీ తన 13 సిరీస్ ఫోన్లను ఆగస్టు 29న భారత్లో లాంచ్ చేయనుంది. కంపెనీ రాబోయే సిరీస్‌లో రియల్‌మీ 13, రియల్మీ 13+ అనే రెండు ఫోన్లు ఉన్నాయి. కొత్త డివైజ్‌లలో కంపెనీ గొప్ప డిస్‌ప్లేను అందించబోతోంది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. రియల్‌మీ 13లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, రియల్‌మీ 13+ డైమెన్సిటీ 7300ఈ చిప్ సెట్ ఉండనున్నాయి. రియల్‌మీ 13 స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. అదే సమయంలో, రియల్మీ 13+ లో కంపెనీ 8 మెగాపిక్సెల్ అదనపు అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్‌ను అందించబోతోంది. 80 వాట్ల ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది.