ఒక్క రీఛార్జ్.. 365 రోజులు వ్యాలిడిటీ.. మరి బెస్ట్ ప్లాన్ ఏదంటే

www.mannamweb.com


:2024 పూర్తయ్యి 2025 కి స్వాగతం చెప్పడానికి ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కొత్త సంవత్సరంలో రీఛార్జ్ కష్టాలు తప్పాలంటే ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.

అయితే ఇప్పటికే టాప్ టెలికాం సంస్థలన్నీ ఇయర్లీ ప్లాన్స్ ను తీసుకొచ్చేసాయి. అయితే ఇందులో బెస్ట్ ప్లాన్ ఏదంటే..

ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలని ఇప్పటికే బెస్ట్ ప్లాన్స్ ను తీసుకొచ్చేసాయి. ఇందులో ఎన్నో బెస్ట్ ప్లాన్స్ సైతం ఉన్నాయి. రిలయన్స్, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వార్షిక రీఛార్జ్ ను అదిరిపోయే బెనిఫిట్స్ తో అందిస్తున్నాయి. ఇక ఈ ప్లాన్స్ లో ఏది బెస్ట్? ఏది రీఛార్జ్ లో లాభాలు ఎక్కువగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం.

జియో రీఛార్జ్ ప్లాన్స్ –

ప్రైవేట్ టెలికాం సంస్థల్లో టాప్ ప్లేస్ లో ఉన్న జియో 336 రోజుల రీఛార్జ్ ప్లాన్ తో పాటు 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చేసింది. ఇందులో 336 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్ ధర రూ.285. ఈ ప్లాన్ లో మొత్తం 24GB లభిస్తోంది. ఇక దీంతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రతీ 28 రోజులకు 50 SMS, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది. ఇక జియో అందిస్తున్న ఏడాది రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 3,599గా ఉంది. ఈ ప్లాన్ లో కూడా 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS సదుపాయం కూడా కలదు. ఇక ఈ ప్లాన్‌తో జియో యాప్‌ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ –

ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇక వీటిలో చవకైన ఏడాది ప్లాన్ ధర రూ. 1999. ఈ ప్లాన్ లో 24Gb హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS సదుపాయం కూడా కలదు.

వొడాఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ –

వొడాఫోన్ 365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఇక వీటిలో చవకైన ఏడాది ప్లాన్ ధర రూ. 1999. ఈ ప్లాన్ లో ఎయిర్టెల్ ఇచ్చినట్లే 24Gb హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS సదుపాయం కూడా కలదు.

బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ –

బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర రూ.2,999. ఈ రీఛార్జ్ ప్లాన్ 4G నెట్‌వర్క్ తో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. ఇందులో ప్రతీ రోజూ 3 GB డేటా వస్తుంది. దీంతో పాటు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా కలదు.

ఈ ప్లాన్స్ తో పాటు టెలికాం సంస్థలన్నీ మరిన్ని ప్లాన్స్ ను బెస్ట్ గా అందిస్తున్నాయి. అందులో ఓటిటి ప్లాట్ఫామ్స్ తో పాటు ఇతర ప్రయోజనాలను సైతం ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఏడాది పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలనుకున్న యూజర్స్ వీటిని ట్రై చేసేయండి.