రేసింగ్ లుక్‌తో రీడిజైన్‌డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల

బజాజ్ ఆటో ఇండియా దేశీయ మార్కెట్‌లో 2025 పల్సర్ NS 400Z ను అధికారికంగా విడుదల చేసింది. గత వెర్షన్ డిజైన్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు లేకపోయినా, ఇందులో అనేక మెకానికల్, రిట్రో-ఫిట్ ఫీచర్లు కొత్తగా అందించబడ్డాయి. మరి ఆ మార్పులు, కొత్తగా ఏమి చేర్చారో ఒకసారి చూద్దామా..


2025 Pulsar NS 400Z లో 373cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించబడింది. ఇదే ఇంజిన్ గత మోడల్‌లోనూ ఉంది. కానీ ఈసారి శక్తి సామర్థ్యం 40 hp నుంచి 43 hp కు పెరిగింది. స్పోర్ట్ మోడ్‌లో రెడ్‌ లైన్ 10,700 rpmకి పెరిగింది. టాప్ స్పీడ్ కొద్దిమేర పెరిగింది. గత మోడల్ టాప్ స్పీడ్ 150 కిమీ/గం ఉండగా.. తాజా మోడల్ టాప్ స్పీడ్ 157 కిమీ/గం కి పెరిగింది.

ఇక యాక్సిలరేషన్ పరఁగంగా చూస్తే.. 0-60 కిమీ/గం వేగాన్ని 2.7 సెకన్లు (0.5 సెకన్లు వేగంగా), 0-100 కిమీ/గం వేగాన్ని 6.4 సెకన్లు (0.9 సెకన్లు వేగంగా) చేరుకుంటుంది. ఇక ఫీచర్లు, హార్డ్‌వేర్ అప్‌డేట్ల పరంగా చూస్తే.. క్విక్‌షిఫ్టర్ గేర్ సిస్టమ్ తో మరింత సాఫీగా గేర్ మార్పులు చేయవచ్చు. 150-సెక్షన్ వెడల్పు అయినా టైర్ (రిట్రోఫిట్‌ ఎంపిక), లేదా 140 సెక్షన్ టైర్‌ను ఎంపిక చేసుకునే వీలుంది. ఇంకా సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ (రిట్రోఫిట్) బ్రేకింగ్ పనితీరును 7% మెరుగుపరచనున్నట్లు కంపెనీ చెబుతోంది. 2025 Pulsar NS 400Z ని రూ. 1,92,328 (ఎక్స్-షోరూమ్) కి విడుదల చేశారు.

మొత్తంగా.. స్పోర్టీ లుక్, మెరుగైన శక్తి, బ్రేకింగ్ సామర్థ్యంతో బజాజ్ 2025 Pulsar NS 400Z ను యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. పెరిగిన వేగం, టార్క్, బ్రేకింగ్ మెరుగుదలతో ఇది నెక్స్ట్ లెవెల్ NS అనిపిస్తోంది. చుడాలిమరి పల్సర్ అభిమానులు ఈ ప్రీమియం స్టైలిష్ బైకు ను ఎంతబరు ఆదరిస్తారో..

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.