పాస్‌ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మల తొలగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్ విధానం రద్దుతో పాటు పాత టెండర్ విధానం పునరుద్ధరించాలని ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయించారు. జగన్ ప్రభుత్వంలో పాస్‌ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై వేసిన జగన్ బొమ్మల్ని పూర్తిగా తొలగించాలని క్యాబినెట్‌ తీర్మానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పట్టదారు పుస్తకాలపై జగన్‌ ఫోటోలను తొలగించి 21లక్షల కొత్త పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంతో ముద్రించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో భూమి హద్దులునిర్ణయించేందుకు 77లక్షల సర్వే రాళ్లపై వేసిన జగన్ ఫోటోలు తొలగించాలని నిర్ణయించారు. దీంతో పాటు వివాదాస్పద భూముల ు, 22ఏ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించారు.

కొత్తగా 2774 రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈపోస్ మిషన్ల కొనుగోలుకు రూ.11కోట్ల విడుదల చేశారు.

రాష్ట్రంలో తిరిగి సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం, సిఎంఓ, మంత్రుల పేషీల్లో పలు పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. సిఎం కార్యాలయం, సిఎంఓలో 71 పోస్టులు, మంత్రుల పేషీల్లో 96 పోస్టులను భర్తీకి క్యాబినెట్‌ అమోదం తెలిపింది.

ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు చర్యలపై క్యాబినెట్‌లో చర్చిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్ విధానం రద్దు చేసి, పాతవిధానంలో టెండర్లను పిలిచేందుకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

పోలవరం ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులు ప్రారంబించడంతో పాటు మేఘా సంస్థతోనే వాటిని చేపట్టేందుకు క్యాబినెట్ అమోదం తెలిపింది.

అబ్కారీ వ్యవస్థను పునర్వ్యస్థీకరించడంతో పాటు సెబ్ రద్దు నిర్ణయానికి క్యాబినెట్ అమోదం తెలిపింది. 21.86లక్షల పుస్తకాలపై కొత్త ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించడంతో పాటు 77లక్షల సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోలను తొలగిస్తారు.

రేషన్‌ దుకానాల్లో సార్టెక్స్‌ బియ్యానికి బదులు పోర్టిఫైడ్ బియ్యం సరఫరాకు క్యాబినెట్ అమోదం తెలిపింది.