ఇంకు మరకలు ఈజీగా పోవాలంటే ఈ చిట్కాలు బెస్ట్

www.mannamweb.com


పిల్లలు స్కూల్‌కి వెళ్లారంటే డ్రెస్సుల మీద అనేక మరకలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకు మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇంకు మరకలు అంత త్వరగా వదిలవు.

వీటిని వదిలించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఈ చిట్కాలు పాటిస్తే ఈజీగా పోగొట్టవచ్చు.

పాలతో మీరు ఇంకు మరకలను ఈజీగా పోగొట్టవచ్చు. ఎందుకంటే పాలలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇంకు మరకలను వదిలించడంలో హెల్ప్ చేస్తుంది. ఇందు కోసం ఇంకు మరక అంటిన చోట పాలు వేసి బాగా రుద్దండి. అలాగే కొన్ని పాలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం సబ్బుతో ఉతకాలి.

ఆల్కహాల్‌తో కూడా మనం ఇంకు మరకలను వదిలించుకోవచ్చు. కొద్దిగా ఆల్కహాల్ తీసుకుని మరకలు ఉన్న చోట దూదితో వేసి రుద్దండి. వదలకపోతే మాత్రం కొద్దిగా ఆల్కహాల్ కలిపిన నీటిలో ఓ గంట పాటు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి.

ఇంకు మరకలను షేవింగ్ క్రీమ్‌తో కూడా పోగొట్టుకోవచ్చు. మరకలు ఉన్నచోట షేవింగ్ క్రీమ్ తీసుకుని మరకపై రుద్దండి. ఆ తర్వాత సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి. ఇది చాలా సింపుల్ చిట్కా.

అదే విధంగా ఉప్పు, నిమ్మరసంతో కలిపి కూడా ఇంకు మరకలను వదిలించవచ్చు. నిమ్మ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి టూత్ బ్రష్‌తో ఇంకు మరకలు ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత కాసేపు సర్ఫ్‌లో నానబెట్టి సబ్బుతో ఉతికి ఎండలో ఆరేస్తే మరలకు పోతాయి.