Retirement Plan: రూ. 20వేల జీతంతోనే కోటీశ్వరులు కావొచ్చు.. ఈ సింపుల్ ఫార్ములా ఫాలో అవ్వండి చాలు..

చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలను పోషించుకునే వారిని.. కొంత మొత్తం పొదుపు చేయండి.. రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోండి.. అని చెబితే నవ్వి ఊరుకుంటారు.
ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం వారి కుటుంబ పోషణకు సరిపోతుంది. అటువంటి సమయంలో ఇతర పెట్టుబడులు, ప్లాన్ల గురించి వారు ఆలోచించలేరు. ఏదైనా స్కీమ్లో అటువంటి వారిని పెట్టుబడి పెట్టించేలా చేయడం కూడా చాలా కష్టం. జీతం పెరిగాక, ఆదాయం ఉన్నతి సాధించాక చూదాంలే అని దాటవేస్తుంటారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు పొదుపు మార్గాలు మా వల్ల కాదులే.. అవన్నీ ధనవంతులకే అనుకుంటూ ఉంటారు. అయితే అది సరికాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు అనేది మీ నెలవారీ ఆదాయానికి సంబంధించినదని కాదని చెబుతున్నారు. సరైన ప్రణాళిక ఉంటే రూ. 20,000 ఆదాయం వచ్చే వారు కూడా సరైనా ఫార్ములాను వినియోగిస్తే పొదుపు చేయడంతో పాటు రిటైర్ మెంట్ సమయంలో రూ. కోటి సంపాదించే అవకాశం ఉంటుంది. అదెలాగో తెలియాలంటే ఈ కథనం చివరి వరకూ .


ఇదే ఫార్ములా..
పొదుపును అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆదాయం ఎలా ఉన్నా, ఎంత ఉన్నా మీరు దానిలో ఎంతో కొంత కచ్చితంగా పొదుపు చేయాలంటున్నారు. అలాగే ఆదా చేసిన డబ్బును ఇంట్లో ఉంచకూడదు, ఏదైనా పథకంలో పెట్టుబడి పెడితే వడ్డీల రూపంలో డబ్బు కాలక్రమేణా పెరుగుతుంది. కానీ తక్కువ జీతంతో ఉండే వారు ఎలా ఆదా చేయాలి? ఎంత ఆదా చేయాలనే ప్రశ్న వస్తుంది. ఏ వ్యక్తి తన ఆదాయంలో ఖర్చులన్నీ పోనూ కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు ఉంటున్నారు.

రూ. 20,000 జీతంలో ఎంత పొదుపు చేయాలి?

మీరు నెలకు రూ. 20,000 సంపాదిస్తే, మీ ఆదాయంలో 20 శాతం రూ. 4,000 అని అనుకుందాం. ఆర్థిక నిబంధనల ప్రకారం, మీరు ప్రతి నెలా రూ. 4,000 ఆదా చేయాలి. రూ. 16,000తో మీ ఇంటి ఖర్చులు, అవసరాలన్నీ తీర్చుకోవాలి. మీరు అన్ని ఖర్చులతో ఈ రూ. 4,000 పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడిని ఎక్కువ కాలం కొనసాగించాలి.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

ప్రస్తుతం అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు మంచి రాబడినిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ పై చాలా మందికి అపోహలున్నాయి. రిస్క్ ఎక్కువని, గ్యారంటీ ఉండదని చెబుతారు. అది కొంత వరకూ వాస్తవమే అయినా.. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని అందిస్తాయి. ముఖ్యంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ (ఎస్ఐపీ) పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దీర్ఘకాలంలో పెద్ద ఫండ్‌ను జోడించవచ్చు. ఎస్ఐపీలో సగటు రాబడి 12 శాతం వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అనేక స్థిర ఆదాయ ఎంపికల కంటే ఎక్కువ.

మీరు ఎస్ఐపీలో ప్రతి నెలా రూ. 4,000 ఇన్వెస్ట్ చేసి, ఈ పెట్టుబడిని 28 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, 28 సంవత్సరాలలో, మీ మొత్తం పెట్టుబడి రూ. 13,44,000 అవుతుంది. మీరు దీర్ఘకాలిక మూలధన లాభాలుగా రూ. 96,90,339 పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు 28 సంవత్సరాలలో రూ. 1,10,34,339 మొత్తం రాబడిని పొందుతారు. మీరు ఈ పెట్టుబడిని మరో రెండేళ్లు అంటే 30 సంవత్సరాలు కొనసాగిస్తే.. మీరు రూ. 1,41,19,655 వరకు జోడించవచ్చు.