పాక్‌తో సరిహద్దులో పోరాడి భారత్‌ను గెలిపించాడా..? అల్లు అర్జున్‌ అరెస్టుపై రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

www.mannamweb.com


అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పందించారు. ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పోరాడి భారత్‌ను గెలిపించి వచ్చాడా? అంటూ వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఓ మహిళ చనిపోయిందని.. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలిపాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా? అంటూ ప్రశ్నించారు. ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదైందని.. కోమాలో నుంచి ఆ బాబు బయటకు వస్తే వాళ్ల అమ్మ కనిపించదన్నారు. సినిమా హీరోది వ్యాపారం.. డబ్బులు పెట్టాడు.. వసూలు చేసుకున్నాడని.. ఇందులో ఇచ్చిపుచ్చుకునేందుకు ఏముంది? అన్నారు. అతనేమైనా భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పోరాడి ఇండియాను గెలిపించి వచ్చాడా?.. సినిమా చేశాడు.. డబ్బులు సంపాదించాడు? ఘాటుగా స్పందించారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో మా ప్రమేయం లేదని.. ఘటనలో మహిళ చనిపోయిందని.. కొడుకు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడని.. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులన్నారు. ఫిలింస్టార్‌, పొలిటికల్‌ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదన్నారు. సైలెంట్‌గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండపోయేదన్నారు. కారులోనుంచి బయటకు వచ్చి హడావుడి చేశారు. దాంటో జనం ఒక్కసారిగా ఎగబడడంతో కంట్రోల్‌ చేయలేకపోయారని.. అర్జున్‌ మేనమామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ నేతలేనన్నారు. అల్లు అర్జున్‌ భార్య కుటుంబం నాకు బంధువులేనని.. హోంశాఖ నావద్ద ఉందని.. ఈ కేసు సంబంధించి రిపోర్ట్‌ తనకు తెలుసునన్నారు. సినిమా వాళ్లు పైసలు పెట్టారు.. లాభాలు సాధించారు. వాళ్లు దేశం కోసం చేసిందేమీ లేదన్నారు.